Share News

AP HighCourt: కిలారు రాజేష్ విషయంలో పొరపాటు జరిగిందన్న సీఐడీ

ABN , First Publish Date - 2023-11-10T16:14:01+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ వేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

AP HighCourt: కిలారు రాజేష్ విషయంలో పొరపాటు జరిగిందన్న సీఐడీ

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) తనకు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ (TDP Leader Kilaru Rajesh) వేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై హైకోర్టులో (AP High court) విచారణ జరిగింది. 161, 91 సెక్షన్‌ల కింద నోటీసులు ఇవ్వడాన్ని కిలారు రాజేష్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈరోజు(శుక్రవారం) హైకోర్టులో విచారణకు రాగా.. రాజేష్ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. ఎల్‌ఓసీ నోటీసుల్లో రాజేష్‌ను నిందితుడిగా చూపించిన విషయాన్ని ఆదినారాయణరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మళ్లీ 161, 91 కింద నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ వాదనలు వినిపించారు. తాము ఎల్‌ఓసీ పొరపాటున ఇచ్చామని సీఐడీ తరపు న్యాయవాది చెప్పారు. హైదరాబాద్‌లో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రాజేష్‌ను వెంబడించిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి న్యాయవాది తీసుకువచ్చారు. అయితే తాము రాజేష్‌ను నిందితుడిగా పేర్కొనలేదని సీఐడీ న్యాయవాది చెప్పారు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సీఐడీ న్యాయవాదులు కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టుల ఈనెల 17కు వాయిదా వేసింది.

Updated Date - 2023-11-10T16:14:02+05:30 IST