Lokesh YuvaGalam: లోకేష్‌తో అడుగులు వేయనున్న బ్రాహ్మణి
ABN , First Publish Date - 2023-12-11T10:13:24+05:30 IST
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నిన్నటితో లోకేష్ మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్‌తో పాటు సతీమణి బ్రహ్మణి, తనయుడు దేవాన్ష్ అడుగులు వేయనున్నారు.
కాకినాడ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam) విజయవంతంగా కొనసాగుతోంది. నిన్నటితో లోకేష్ మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్‌తో పాటు సతీమణి బ్రాహ్మణి (Brahmani), తనయుడు దేవాన్ష్ (Devansh) అడుగులు వేయనున్నారు. నిన్నటితో మూడు వేల కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి అవగా.. అందుకు గుర్తుగా మరికాసేపట్లో తేటగుంట హైవేపై లోకేష్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. 3 వేల కిలోమీటర్ల పూర్తి నేపథ్యంలో లోకేశ్‌తో బ్రహ్మణి నడవనున్నారు. ఇందు కోసం ఆదివారం రాత్రే బ్రాహ్మణి, దేవాన్ష్ క్యాంపు సైట్‌కు చేరుకున్నారు. యువనేత ఇప్పటివరకు మొత్తం దూరం 3006.7 కిలోమీటర్లు నడిచారు. ఈరోజు 219వరోజు పాదయాత్రను తుని, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు తేటగుంట పంజాబీ దాబా వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది.
నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇదే..
ఉదయం
9.30 – తేటగుంట పద్మనాభ ఫంక్షన్ హాలు వద్ద డాక్టర్లతో సమావేశం.
11.30 – చామవరం గేటు వద్ద స్థానికులతో సమావేశం.
11.45 – ఎస్. అన్నవరం సాయివేదిక వద్ద భోజన విరామం.
2.00 – ఎస్.అన్నవరం సాయివేదిక వద్ద కాపు సామాజికవర్గీయులతో ముఖాముఖి.
సాయంత్రం
4.00 – ఎస్.అన్నవరం సాయివేదిక వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – తుని హెచ్ పి పెట్రోలు బంకు వద్ద స్థానికులతో మాటామంతీ.
4.40 – తుని ఎన్టీఆర్ విగ్రహం సెంటర్ లో లేబర్ యూనియన్ ప్రతినిధులతో భేటీ.
4.55 – తుని శ్రీరామ థియేటర్ వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
5.25 – తుని గొల్ల అప్పారావు సెంటర్ లో స్థానికులతో సమావేశం.
5.30 – పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశం.
5.50 – పాయకరావుపేట జుడియో షోరూమ్ వద్ద స్థానికులతో సమావేశం.
6.20 – పాయకరావుపేట ట్రాన్స్ కో కార్యాలయం వద్ద స్థానికులతో సమావేశం.
6.30 – పాయకరావుపేట హైవే ముఖద్వారం వద్ద స్థానికులతో సమావేశం.
7.00 – పిఎల్ పురం వద్ద యువతతో సమావేశం.
7.30 – సీతారాంపురంలో స్థానికులతో సమావేశం.
8.00 – నామవరం క్యాంప్ సైట్ వద్ద విడిది కేంద్రంలో బస.