Varla Ramaiah: హిట్లర్, ముస్సోలినీ, ముషారఫ్ లే కాలగర్భంలో కలిశారు.. నువ్వెంత జగన్?

ABN , First Publish Date - 2023-09-19T15:52:42+05:30 IST

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ఆరు నెలల కూడా లేని సమయంలో ప్రతిపక్షాలు లేకుండా ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తహతహలాడుతున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాలను చెల్లాచెదరు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Varla Ramaiah: హిట్లర్, ముస్సోలినీ, ముషారఫ్ లే కాలగర్భంలో కలిశారు.. నువ్వెంత జగన్?

అమరావతి: రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ఆరు నెలల కూడా లేని సమయంలో ప్రతిపక్షాలు లేకుండా ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan reddy) తహతహలాడుతున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాలను చెల్లాచెదరు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేసేందుకు పోలీసు శాఖను పావుగా వాడుకుంటున్నారన్నారు. గత 10 రోజులుగా పోలీసులకు సెలవులు రద్దు చేసి వారిని స్టాండ్ బైలో పెట్టి రోడ్లపైనే ఉంచుతున్నారని అన్నారు. తమ రాజకీయకక్ష కోసం పోలీసులను వాడుకుంటారా? లోకేష్ అరెస్టుకు కూడా రంగం సిద్ధమైందంటూ పోలీసులే ఫీలర్లు వదిలి భయభ్రాంతులు సృష్టిస్తున్నారన్నారు. ప్రజలు పండుగ పూట దేవాలయాలకు వెళ్లి దేవుణ్ని దర్శనం చేసుకోవడానికి కూడా పర్మిషన్లు కావాలా అని ప్రశ్నించారు. వ్యాపారస్తులు షాపులు తెరచి వ్యాపారాలు చేసుకోవడానికి భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడి అరెస్టుతో ఉద్యోగులు కూడా నిర్ణయాలు తీసుకుని ఫైళ్లపై సంతకాలు పెట్టాలంటేనే భయపడుతున్నారన్నారు. ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్‌ను జగన్ మోహన్ రెడ్డి తన స్వార్ధం కోసం అల్లకల్లోలం చేస్తున్నారని.. ఇది సరైన పద్దతి కాదని అన్నారు. అధికారమే శాశ్వతం అనుకుని విర్రవీగిన హిట్లర్, ముస్సోలినీ, ముషారఫ్ లే కాలగర్భంలో కలిసిపోయారు. మీరెంత జగన్? అంటూ వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-19T15:52:42+05:30 IST