TDP Leader Anuradha: మంత్రి రోజా ఆరోపణలకు అనురాధ కౌంటర్.. కోట్లను జగన్ సొంతానికంటూ..
ABN , First Publish Date - 2023-08-12T21:49:03+05:30 IST
వైసీపీ మంత్రి ఆర్కే రోజాపై (YCP minister RK Roja) టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ (Panchumurthy Anuradha) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వైసీపీ మంత్రి ఆర్కే రోజాపై (YCP minister RK Roja) టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ (Panchumurthy Anuradha) ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతం యూనివర్సిటీ యాజమాన్యం 40 ఎకరాలు ఆక్రమించుకుందని రోజా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనురాధ మండిపడ్డారు.
"జగన్ రెడ్డే రూ. 40 కోట్ల ప్రభుత్వ ధనాన్ని తన సొంతానికి వాడుకున్నారు. విశాఖలో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు, గీతం యూనివర్సిటీ యాజమాన్యం 40 ఎకరాల తప్పుడు భూములను ఆక్రమించుకున్నట్లు రోజా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని సొంతానికి వాడుకోవడం వైసీపీ నాయకత్వానికి స్వాభావికంతో వచ్చిన దోపిడీ అలవాటు. ఇడుపులపాయలో దళితుల అసైన్డ్ భూములు ఆక్రమించుకుని ఎస్టేజ్ నిర్మించుకుంది మీరు కాదా?. రూ.40 కోట్ల ప్రజాధనాన్ని జగన్ రెడ్డి తన సొంత ఇంటికి ఏ విధంగా వాడుకున్నాడో మేం ఆధారాలతో వస్తాం. డిబేట్‌కు వచ్చే ధైర్యం వైసీపీకి ఉందా?. గుడ్డ కాల్చి ఎదుటివారిపై వేయడం వైసీపీ నేతలకు అలవాటు. అదే రీతిలో రోజా మాట్లాడుతున్నారు. తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలనుకుంటే మీ బండారమే బయటపడుతుంది." అని పంచుమర్తి అనురాధ సంచలన ఆరోపణలు చేశారు.