Dhulipalla : స్కిల్ డెవలప్మెంట్‌పై జీవో జారీ చేసిన నీలం సాహ్ని పై కేసేది?

ABN , First Publish Date - 2023-10-06T13:15:34+05:30 IST

పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో స్కిల్ డెవలప్మెంట్‌పై వాస్తవాలు పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. స్కిల్ డెవలెప్మెంట్ పై వాస్తవాలు పుస్తకం ద్వారా బహిర్గతం చేశామన్నారు.

Dhulipalla : స్కిల్ డెవలప్మెంట్‌పై జీవో జారీ చేసిన నీలం సాహ్ని పై కేసేది?

అమరావతి : పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో స్కిల్ డెవలప్మెంట్‌పై వాస్తవాలు పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. స్కిల్ డెవలెప్మెంట్ పై వాస్తవాలు పుస్తకం ద్వారా బహిర్గతం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. వైసీపీ దోపిడీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పోరాటం చేస్తున్నందుకే, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రయోగిస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్‌పై జీవో జారీ చేసిన నీలం సాహ్ని పై కేసేందుకు లేదని ప్రశ్నించారు.

నిధులు విడుదలలో సంతకాలు చేసిన ప్రేమ చంద్రారెడ్డి, అజయ్ కల్లంలు నిందితులు కాదా? అని ధూళిపాళ నరేంద్ర ప్రశ్నించారు. విధాన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు మాత్రమే తప్పు చేసారని జైల్లో పెడతారా ? అని నిలదీశారు. ఒక్క రూపాయైనా ఫలానా ఖాతాలోకి మళ్లిందని రుజువు చూపగలరా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వెబ్‌సైటు నుంచి డౌన్‌లోడ్ చేసిన సమాచారం స్కిల్ డబ్బంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడటం చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. యువత తో గంజాయి అమ్మించాలన్నది జగన్మోహన్ రెడ్డి దృక్పథమన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్ధిక ఉగ్రవాది, పిచ్చోడు, పదితలల జగనాసురుడు అని ఏ పేరుతో పిలవాలో ఆయన విచక్షణ కే వదిలేస్తున్నామని ధూళిపాళ్ల అన్నారు.

Updated Date - 2023-10-06T13:15:34+05:30 IST