Rajahmundry Jail: కఠిన ఆంక్షలు.. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2023-10-31T15:26:22+05:30 IST
రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
రాజమహేంద్రవరం: రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (TDP Chief Chandrababu Naidu) ఏపీ హైకోర్టు (AP High Court) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాసేపట్లో చంద్రబాబు జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) వద్దకు వస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు అందరిని పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుని చూడకుండా అడ్డుకోవడంపై నేతల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 144 సెక్షన్ పేరుతో ఎందుకు వేధిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా చంద్రబాబు వెంట రావులపాలెం వరకు వెళ్లి తీరుతామని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. కిలోమీటర్ మేర పోలీసుల ట్రాపిక్ ఆంక్షలు విధించారు. రోడ్డుకి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. టీడీపీ నేతలను అడగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు.