MLC Elections: దౌర్జన్యంగా ఓట్లేసుకున్న వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2023-03-13T18:01:47+05:30 IST

తిరుపతి (Tirupati) చిన్నబజారు పోలింగ్ బూత్లో వైసీపీ నేతలు (YCP leaders) దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ బూత్ 229లో వైసీపీ నేతలు కెమెరాలు ఆపివేసి దౌర్జన్యంగా ఓట్లేసుకున్నారు.

MLC Elections: దౌర్జన్యంగా ఓట్లేసుకున్న వైసీపీ నేతలు

తిరుపతి: తిరుపతి (Tirupati) చిన్నబజారు పోలింగ్ బూత్లో వైసీపీ నేతలు (YCP leaders) దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ బూత్ 229లో వైసీపీ నేతలు కెమెరాలు ఆపివేసి దౌర్జన్యంగా ఓట్లేసుకున్నారు. ఏపీవోని కొట్టి దొంగ ఓట్లు వేసుకున్నారు. దీంతో బీజేపీ సీపీఐ, సీపీఎం, టీడీపీ అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఏపీఓపై దౌర్జన్యం జరిగిన పాఠశాల పోలింగ్ బూత్ ఎదుట నిరసనకు దిగారు. అఖిలపక్షాల ఆందోళనకు పోటీగా వైసీపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో చిన్నబజారు వీధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే తిరుపతిలోని కుమ్మరితోపు పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ (TDP) కార్యకర్తలు దొంగ ఓటర్లను పట్టుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయపడ్డారు.

నంద్యాల జిల్లాలోనూ అదే పరిస్థితి

నంద్యాల జిల్లా (Nandyala District) ఆత్మకూరు పోలింగ్స్టేషన్ దగ్గర కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రాల్లో యధేచ్చగా వైసీపీ నేతల సంచారించారు. సమాచారం అందుకున్న.. టీడీపీ నేత బుడ్డా రాజశేఖరరెడ్డి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వైసీపీ నేతలను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు తరలించారు. గందరగోళంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. నందికొట్కూరులో టీడీపీ నేత మండ్ర శివానందరెడ్డి ఓటు వేసేందుకు వచ్చారు. అయితే క్యూలైన్లో నిలబడకుండా ఓటు వేసేందుకు వెళ్తున్న వైసీపీ నేతలను శివానందరెడ్డి నిలదీశారు. దీంతో శివానందరెడ్డి డౌన్ డౌన్ అంటూ వైసీపీ నేతలు గొడవకు దిగారు. ఎన్నికల కేంద్రం బయట టీడీపీ, వైసీపీ శ్రేణులు గొడవకు దిగాయి. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

Updated Date - 2023-03-13T18:01:47+05:30 IST