Share News

Chandrababu Bail : చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌‌ తీర్పులో ఈ విషయాలు గమనించారా..?

ABN , First Publish Date - 2023-11-20T17:58:47+05:30 IST

Chandrababu Naidu Bail : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) ఏపీ హైకోర్టులో (AP High Court) రెగ్యులర్ బెయిల్ లభించిన సంగతి తెలిసిందే..

Chandrababu Bail : చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌‌ తీర్పులో ఈ విషయాలు గమనించారా..?

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) ఏపీ హైకోర్టులో (AP High Court) రెగ్యులర్ బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఈనెల 29 నుంచి బెయిల్‌కు అంతకుముందు ఉన్న షరతులన్నింటినీ తొలగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. అయితే.. బెయిల్ రెగ్యులర్ విషయమై 39 పేజీల తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లిఖార్జునరావు వెల్లడించారు. ఇందులో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటి..? షరతులు ఏంటి..? అనే ఇంట్రస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం..


Chandrababu-AP-High-Court.jpg

హైకోర్టు ఇచ్చిన తీర్పులో (High Court Verdict) ఏముందంటే..?

  • స్కిల్ కేసు 2021 డిసెంబర్ 9న కేసు నమోదైంది

  • చంద్రబాబుపై 2023 సెప్టెంబర్ 9న కేసునమోదు చేశారు

  • అప్పటి నుంచి ఆయన ఈ కేసులో జోక్యం చేసుకున్నట్లుగానీ రికార్డులను టాంపర్ చేసినట్లుగానీ ప్రాసిక్యూషనే చెప్పలేదు

  • సబ్ కాంట్రాక్టర్ పన్ను ఎగవేస్తే, చంద్రబాబుకు ఏం సంబంధమని న్యాయవాది లూథ్రా చేసిన వాదనతో ఏకీభవిస్తున్నాం

  • చంద్రబాబుకు ఈ కాంట్రాక్టులో ఉల్లంఘనలు ఉన్నాయని అధికారులు చెప్పారన్న అంశానికి సాక్షాలు లేవు

  • ఈ కేసులో ఇప్పటికే 149 మంది సాక్షులను విచారించి 4 వేల పేజీల డాక్యుమెంట్లు సేకరించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది

1high-court1.jpg

ఇవీ అసలు విషయాలు..!

  • ఇప్పటికీ ఈ డాక్యుమెంట్లు సీఐడీ ఆధీనంలో ఉండటంతో చంద్రబాబు వీటిని ట్యాంపర్ చేసే అవకాశం లేదు

  • జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు పారిపోయే అవకాశం లేదు

  • సాక్షులను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని సీఐడీ తరపున లాయర్లు చేసిన వాదనలకు ఆధారాలు లేవు

  • స్కిల్ కేసులో సుజయత్ ఖాన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ప్రాధమిక సాక్షాలు కూడా లేవు

  • చంద్రబాబు మాజీ పీఎ పెండ్యాల శ్రీనివాస్ విచారణకు గైర్హాజరుకు చంద్రబాబు బెయిల్ పరిశీలనకు ఎటువంటి సంబంధం లేదు

  • చంద్రబాబు కీలక సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీఐడీ చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు చూపలేకపోయారు

  • చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ నేపథ్యంలో హైదరాబాద్‌లో నమోదైన కేసులో బెయిల్ షరతులను ఉల్లంఘించిట్లుగా పరిగణించడం లేదు

  • స్కిల్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సీఐడీ ఎటువంటి ఆధారాలు చూపించలేక పోయింది

  • నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని పేర్కొన్న హైకోర్టు

  • చంద్రబాబు తప్పు చేసినట్లు ఇన్‌కంటాక్స్‌ డిపార్టుమెంట్ ఆరోపణలు చేసింది కానీ ఆధారాలు చూపలేకపోయింది

  • స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఉన్నది నిజం.. రెండు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లు సీఐడీ అంగీకరించింది

  • టీడీపీ ఖాతాలో స్కిల్ స్కామ్‌ డబ్బులు వచ్చాయని సీఐడీ ఆరోపణలు చేసినప్పటికీ, ఆధారాలు చూపలేదు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-20T17:58:49+05:30 IST