TTD: లక్షిత డీఎన్‌ఏ ఆ చిరుతల్లో కనిపించలేదు.. దీంతో..!

ABN , First Publish Date - 2023-09-16T03:44:05+05:30 IST

అలిపిరి నడక మార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసింది తిరుపతి ఎస్వీ జూపార్కులో నిర్బంధంలో ఉన్న నాలుగు చిరుతల్లో తొలి రెండూ కాదని తేలింది. లక్షితపై దాడి చేసిన చిరుత వాటిలో

TTD: లక్షిత డీఎన్‌ఏ ఆ చిరుతల్లో కనిపించలేదు.. దీంతో..!

తొలి రెండు చిరుతల డీఎన్‌ఏ ఫలితాలు

తిరుపతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అలిపిరి నడక మార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసింది తిరుపతి ఎస్వీ జూపార్కులో నిర్బంధంలో ఉన్న నాలుగు చిరుతల్లో తొలి రెండూ కాదని తేలింది. లక్షితపై దాడి చేసిన చిరుత వాటిలో లేదని డీఎన్‌ఏ ఫలితాలు తేల్చాయి. దీంతో ఆ రెండింటిలో ఒకదాన్ని ఎస్వీ జూపార్కు నుంచి శ్రీశైలం అడవుల్లో విడిచిపెట్టి స్వేచ్ఛ ప్రసాదించారు. మరోదాన్ని విశాఖ జూపార్కుకు తరలించారు. తిరుపతి నుంచి తిరుమలకు అలిపిరి నడక మార్గంలో గత నెల 11వ తేదీన నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షిత చిరుత దాడిలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపడంతో రంగంలోకి దిగిన టీటీడీ, అటవీ శాఖలు ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఆ క్రమంలో ఇప్పటి వరకు నాలుగు చిరుతలను బోన్లలో బంధించారు.

Updated Date - 2023-09-16T11:38:39+05:30 IST