CBN Arrest : నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై కేంద్ర మంత్రి స్పందన

ABN , First Publish Date - 2023-09-17T18:36:30+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును (TDP Chief Chandrababu) జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించిందని దేశమంతా చర్చించుకుంటున్నారు..

CBN Arrest : నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై కేంద్ర మంత్రి స్పందన

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును (TDP Chief Chandrababu) జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించిందని దేశమంతా చర్చించుకుంటున్నారు. రాజకీయ, సినీ.. పలు రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించి తీవ్రంగా ఖండించారు. అంతేకాదు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు సైతం సోషల్ మీడియాలో, మీడియా ముఖంగా స్పందించారు. మరికొందరు నేరుగా చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ ముఖ్యనేతలతో ఫోన్‌లో మాట్లాడారు కూడా. తాజాగా కేంద్ర మంత్రి దేవ సింహ్ చౌహన్ (Devusinh Chauhan) స్పందించారు. ఏపీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న ఆయన.. విశాఖ వేదికగా మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై రియాక్ట్ అయ్యారు.


Devusinh-Chauhan.jpg

కేంద్ర మంత్రి ఏమన్నారు..?

చంద్రబాబు అరెస్టుపై సరైన సమయంలో కేంద్ర అధినాయకత్వం స్పందిస్తుందని కేంద్ర సహాయ శాఖ మంత్రి దేవ సింహ్ చౌహన్ చెప్పుకొచ్చారు. బాబు అరెస్టును బీజేపీ నేతలు కూడా ఖండించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా కేంద్ర మంత్రి స్పందించారు.తెలంగాణ లో బీఆర్ ఎస్ పార్టీ అవినీతి కి పాల్పడుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కర్ణాటక లో 45 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. భగవాన్ విశ్వకర్మ జయంతి రోజున మోదీ పుట్టిన రోజు జరగడం ఆనందంగా ఉంది. సామాజిక, ఆర్ధిక ప్రగతికి కేంద్ర పథకాలు దోహదం చేస్తున్నాయి. సరి కొత్త భారత్ ఆవిష్కరణకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇప్పుడు వచ్చిన మెజారిటీ కంటే 2024 అధిక మెజారిటీ వస్తుంది’ అని చౌహన్ ధీమా వ్యక్తం చేశారు.

Chaohan.jpg

ఇదే మా నినాదం..

సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ నినాదంతో ముందుకు వెళుతున్నాము. 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. జీ-20 నిర్వహించి ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకునేలా చేశాం. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేసాం. దీని ఫలితంగా టూరిజం పెరుగుతుంది. వసుదేవ కుటుంబ నినాదంతో ముందుకు వెళ్తున్నాము. కేవలం నెంబర్ గేమ్‌లో మాత్రమే మాకు వ్యతిరేకం వచ్చింది. సనాతన ధర్మం కోసం కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దేశ ఔన్నత్యాన్ని పెంపొందిస్తూన్న విధానాల మీద వాక్యాలు చేయడం దారుణం అని చౌహన్ చెప్పుకొచ్చారు.

Devusinh1.jpg

Updated Date - 2023-09-17T18:53:22+05:30 IST