AP NEWS: వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.: వర్ల కుమార్ రాజా
ABN , First Publish Date - 2023-08-10T21:46:14+05:30 IST
పేదప్రజల ఉసురు పోసుకుంటున్న వైసీపీ ప్రభుత్వాని(ycp govt)కి రోజులు దగ్గరపడ్డాయని తెలుగుదేశం నేత వర్ల కుమార్ రాజా(Telugu Desam leader Varla Kumar Raja) అన్నారు.
కృష్ణాజిల్లా (పామర్రు): పేదప్రజల ఉసురు పోసుకుంటున్న వైసీపీ ప్రభుత్వాని(ycp govt)కి రోజులు దగ్గరపడ్డాయని తెలుగుదేశం నేత వర్ల కుమార్ రాజా(Telugu Desam leader Varla Kumar Raja) అన్నారు. గురువారం నాడుమువ్వ మండలంలోని జగనన్న కాలనీలల్లో వర్ల కుమార్ రాజా పర్యటించారు. కనీస మౌలిక వసతులు లేక అధ్వానంగా ఉన్న అయ్యంకి, పెదపూడి లేఅవుట్ల పరిశీలించారు..ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్, రోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని పెదపూడి కాలనీవాసుల ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వర్ల కుమార్ రాజా మీడియాతో మాట్లాడుతూ.. నిర్దేశించిన సమయంలో ఇల్లు కట్టుకోకుంటే స్థలం రద్దు చేస్తామనడంతో, అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారని చెప్పారు. నేడు తమ ఇళ్లకు వెళ్లేందుకు కూడా దారి లేక పేద కుటుంబాలు అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ అసమర్ధతతో అయ్యంకి జగనన్న కాలనీలోని ఇళ్లు అసాంఘిక కార్యాకలపాలకు అడ్డాగా మారాయని చెప్పారు.అప్పుల పాలైన పేద కుటుంబాలకు సమాధానం ఎవరు చెబుతారని వర్ల కుమార్ రాజా అన్నారు.