Varla Ramaiah: సజ్జల భార్గవ్‌పై వర్ల రాయమ్య సంచలన ఆరోపణలు.. జగన్, సజ్జల, భార్గవ్ ముగ్గురూ...

ABN , First Publish Date - 2023-07-11T19:36:10+05:30 IST

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కారుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Varla Ramaiah: సజ్జల భార్గవ్‌పై వర్ల రాయమ్య సంచలన ఆరోపణలు.. జగన్, సజ్జల, భార్గవ్ ముగ్గురూ...

అమరావతి: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కారుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.


"వైసీపీ సోషల్ మీడియా విభాగం చూస్తున్న సజ్జల భార్గవ్ (Sajjala Bhargav) అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. అలాగే చాలా ఫోన్ల నుంచి డేటా చోరీ చేస్తున్నారు. ప్రజల ప్రైవేట్ జీవితాల్లోకి తొంగి చూసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు..? ఎవరి ఫోన్లల్లో ఏం మాట్లాడుకుంటున్నారో సీఎం జగన్ (Jagan) సజ్జల (Sajjala), భార్గవ్ (Bhargav).. , ముగ్గురూ వింటారట. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ చంద్రబాబు ప్రధానికి లేఖ రాస్తే.. సాక్ష్యాలు తీసుకురమ్మని అప్పటి డీజీపీ సవాంగ్ చెప్పారు. అధికార పార్టీకి ఓ న్యాయం.. ప్రతిపక్షానికో న్యాయమా..? ఇదే ఐపీఎస్ ట్రైనింగులో నేర్పింది." అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.


"ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామంటూ మంత్రులు పెద్దిరెడ్డి, అమర్నాధ్ స్పష్టంగా చెప్పిన ఆధారాలున్నాయి. టీడీపీ లీడర్లెవరికీ డీజీపీ అపాయిమెంట్ ఇవ్వడం లేదు. టీడీపీ లీడర్లకు ఎందుకు అపాయిమెంట్ ఇవ్వడం లేదో కూడా చెప్పడం లేదు. గత డీజీపీ సవాంగ్‌ను ఒకట్రొండు సార్లు చూసే భాగ్యం కలిగింది.. కానీ ప్రస్తుత డీజీపీ ముఖారవిందం చూసే భాగ్యం దక్కలేదు. డీజీపీ కార్యాలయం వద్ద కెళ్లినా మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదు. నిన్ననే వైసీపీ మహిళా విభాగం నేతలకు.. పిన్నెల్లికి అపాయిమెంట్ ఇచ్చిన డీజీపీ.. మాకెందుకు అపాయిమెంట్ ఎందుకివ్వడం లేదు. అధికార పార్టీ నేతలకే డీజీపీనా..? డీజీపీ కేవీ రాజేంద్రనాధ్ రెడ్డి తన విధులు నిర్వర్తించడం లేదు. ఇకపై నేను డీజీపీ కార్యాలయానికి వెళ్లను.. ఫిర్యాదులను మెయిల్ చేస్తాం." అని వర్ల రామయ్య అన్నారు.

Updated Date - 2023-07-11T19:46:42+05:30 IST