Varla Ramaiah: ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది

ABN , First Publish Date - 2023-03-12T19:38:04+05:30 IST

వైసీపీ (YCP) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JaganMohanReddy)పై టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Varla Ramaiah: ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది

గుంటూరు: వైసీపీ (YCP) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (JaganMohanReddy)పై టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రక్రియ ప్రహసనంగా మారిందని వర్ల రామయ్య విమర్శించారు. స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో కనపడటం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని వర్ల రామయ్య ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉందంటూ లోకేష్‌ (lokesh)ను తంబళ్లపల్లి నుంచి తరలించిన ప్రభుత్వం.. అధికార పార్టీ నేతలను యథేచ్ఛగా తిరగనిస్తోందని వర్ల రామయ్య మండిపడ్డారు. 30 శాతం దొంగ ఓట్లున్నా అధికారులు పట్టించుకోకపోవడం క్రమశిక్షణా రాహిత్యమని వర్ల రామయ్య అన్నారు.

ఇటీవల వల్లభనేని వంశీ (vallabhaneni vamsi mohan), కొడాలి నాని (kodali nani)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ ఒక మోస్ట్ ఇంటెలిజెంట్ క్రిమినల్ అని, ఇక కొడాలి నాని ఒక గ్రామ సింహం అంటూ మండిపడ్డారు. గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో వైసీపీ (YCP) గుండాలను మించిన అత్యంత తీవ్ర నేరగాడు వల్లభనేని వంశీ అని వర్ల రామయ్య ఆరోపించారు. గన్నవరంలో వైసీపీ మూకలు టీడీపీ కార్యాలయం, వ్యక్తులపై దాడికి పాల్పడతారని ఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు ముందే తెలుసన్నారు. పోస్టింగ్ ఇవ్వరేమోనన్న భయంతో జిల్లా ఎస్పీ అన్ని విషయాలు దాచి పెడుతున్నారని మండిపడ్డారు. పార్టీ ఆఫీస్, నాయకుల ఆస్తులపైనే దాడులు చేసి.. తిరిగి తమ నాయకులపైనే కేసులు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి?, అరాచకాలు, అవినీతితో వైసీపీ సర్కార్ పాలన సాగిస్తోంది.’’ అని వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

Updated Date - 2023-03-12T19:39:03+05:30 IST