Velagapudi Ramakrishna Babu: పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని ఉద్యోగాలు చేస్తున్నారు

ABN , First Publish Date - 2023-09-20T13:13:22+05:30 IST

తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. బాబు వెంటే తామున్నామంటూ ప్లకార్డుల ప్రదర్శన జరిగింది. పోస్ట్ కార్డు ఉద్యమం మూడోరోజు సైతం కొనసాగుతోంది.

Velagapudi Ramakrishna Babu: పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని ఉద్యోగాలు చేస్తున్నారు

విశాఖ : తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. బాబు వెంటే తామున్నామంటూ ప్లకార్డుల ప్రదర్శన జరిగింది. పోస్ట్ కార్డు ఉద్యమం మూడోరోజు సైతం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ బాబు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలను ప్రపంచమంతా చూస్తోందన్నారు. తమ నాయకుడి క్షేమం కోసం ఆలయానికి వెళ్ళకుండా పోలీసులు అడ్డుపడి అరెస్టులు చేశారన్నారు. పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని ఉద్యోగాలు చేస్తున్నారని విమర్శించారు. రాక్షస పాలనకు ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలని రామకృష్ణబాబు ప్రశ్నించారు.

Updated Date - 2023-09-20T13:13:22+05:30 IST