AP News: ఏజెన్సీలో తప్పని డోలి కష్టాలు.. ప్రభుత్వం స్పందించాలంటూ వేడుకోలు
ABN , First Publish Date - 2023-11-01T15:51:56+05:30 IST
ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు. ఏజెన్సీలో ఉండే గర్భిణి మహిళలు అష్టకష్టాలు పడి మరీ బిడ్డలకు జన్మనిస్తున్నారు.
అల్లూరి: ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు. ఏజెన్సీలో ఉండే గర్భిణి మహిళలు అష్టకష్టాలు పడి మరీ బిడ్డలకు జన్మనిస్తున్నారు. పురిటి నొప్పులు వస్తే రహదారులు సరిగా లేక డోలిలోనే ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి. తాజాగా అరకులోయ మండలం ఇరగాయ పంచాయితీ జరిమానుగూడ గ్రామంలో పోయ స్వాతి అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో వైద్యం కోసం డోలీమోతలోనే బంధువులు ఆసుపత్రికి తరలించారు. గర్భిణీ స్వాతిని సుమారు 7 కిలోమీటర్ల దూరం వరకు డోలిమోతలో ఆస్పత్రికి తరలించారు. జరిమానుగుడ గ్రామం నుంచి అరకులోయ మండలం గన్నెల వైద్య కేంద్రానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలి కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం గర్భిణి ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.