Home » Araku valley
‘అరకు చలి ఉత్సవ్’ రెండో రోజైన శనివారం ఉత్సాహంగా సాగింది. ప్రధాన కేంద్రమైన డిగ్రీ కళాశాల మైదానం సందర్శకులతో కిటకిటలాడింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ‘చలి ఉత్సవ్-25’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
Araku Utsav: జనవరి 31 నుంచి 3 రోజులపాటు అరకులో చలి పండుగ జరుగనుంది. దీనికి సంబంధించి చలి ఉత్సవం పేరుతో ఏపీ ప్రభుత్వం పోస్టర్లు విడుదల చేసింది. ఈ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయను ఈ నెల 12వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 25 మంది న్యాయమూర్తులు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందర్శించనున్నారు.
మధ్య భారతం నుంచి వీస్తున్న అతి శీతల గాలుల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చలి మరింత పెరిగింది.
Andhrapradesh: అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. గత కొంతకాలంగా విద్యార్థుల దగ్గర నుంచి కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, స్టోర్ కీపర్ ప్రతిదానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. టీసీల కోసం ఫీజు, సెమిస్టర్ పాసైన సర్టిఫికెట్ కోసం ఫీజు, ఫ్రీ అడ్మిషన్లకు కూడా 9800 చొప్పున ప్రతి డిగ్రీ ప్రొవిజనల్ కోసం రూ.200 ఇలా ప్రతిదానికి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడు.
అరకులోయ-లోతేరు రోడ్డులోని నాంది ఫౌండేషన్ పల్పింగ్ సెంటర్ సమీపంలో గురువారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యటక కేంద్రాలైన కటికి, చాపరాయి జలపాతాల సందర్శనకు రాష్ట్ర పర్యాటన శాఖ అనుమతి ఇచ్చింది. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో కటికి, చాపరాయి జలపాతాలకు భారీగా వరదనీరు పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు.
Andhrapradesh: జిల్లాలోని అరకులో విద్యుత్ సరఫరా నిలిచిచిపోయింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో అరకు పరిసర ప్రాంతాలలో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలులు విపరీతంగా వీస్తుండడంతో విద్యుత్ వైర్లపై చెట్లు కొమ్మలు పడుతుండడం వలన విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు.
సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు.. కొత్తవలస-కిరండోల్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులతో ముప్పు వాటిల్లేలా ఉంది. రెండో ట్రాక్‌ను బొర్రా గుహలపై నుంచి నిర్మిస్తే గుహలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.