Yuvagalam: నేడు లోకేష్ పాదయాత్ర ఇలా...
ABN , Publish Date - Dec 17 , 2023 | 08:09 AM
విశాఖ: అబద్ద వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ చేతిలో దగాపడిన నవ్యాంధ్రను పరిరక్షించుకోవడంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఆదివారం పెందుర్తి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలలో జరగనుంది.
విశాఖ: అబద్ద వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ చేతిలో దగాపడిన నవ్యాంధ్రను పరిరక్షించుకోవడంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఆదివారం పెందుర్తి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలలో జరగనుంది. యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యువనేతకు ప్రజలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, సామాన్యులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనకు టీడీపీ, జనసేన నాయకులు పూలమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. లోకేష్ శనివారం 13.7 కి.మీ. నిడిచారు. కాగా ఇప్పటి వరకు మొత్తం 3101.4 కి.మీ. నడిచారు.
225వరోజు యువగళం వివరాలు..
ఉదయం 8.00 గంటలకు తోటాడ స్మార్ట్ సిటీ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం.
– 8.15 తోటాడ హనుమాన్ టెంపుల్ వద్ద స్థానికులతో సమావేశం.
– 8.30 తోటాడ జంక్షన్ లో బిసిలతో భేటీ
– 8.45 సిరసపల్లిలో స్థానికులతో సమావేశం.
– 9.45 వెంకటాపురం సెంటర్ లో స్థానికులతో భేటీ
– 10.45 పాదయాత్ర పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
– 10.55 భరణికం గ్రామంలో స్థానికులతో సమావేశం.
– 11.25 పరవాడ సంతబయలు వద్ద భోజన విరామం.
– 2.00 పరవాడ సంతబయలు వద్ద పంచగ్రామాల ప్రజలతో ముఖాముఖి.
సాయంత్రం
– 4.00 పరవాడ సంతబయలు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
– 4.15 పరవాడ సంతబయలులో ఆక్వారైతులతో సమావేశం.
– 4.25 పరవాడ రామాలయం వీధి వద్ద స్థానికులతో భేటీ.
– 4.40 పరవాడ చిన్నా స్కూలు వద్ద మహిళలతో సమావేశం.
– 4.55 పరవాడ ఎమ్మార్వో ఆఫీసు జంక్షన్ లో అంగన్వాడీలతో భేటీ.
– 5.10 పరవాడ ఐఓసి పెట్రోలు బంకు వద్ద రజకులతో సమావేశం.
– 5.20 గొర్లవానిపాలెం జిజె కాలేజి వద్ద యువతతో ప్రత్యేక కార్యక్రమం.
– 5.25 గొర్లవానిపాలెం బసవతారకం కాలనీ వద్ద మత్స్యకారులతో సమావేశం.
– 5.30 గొర్లవానిపాలెం టిడ్కోగృహాల వద్ద గ్రామస్తులతో భేటీ
– 5.35 గొర్లవానిపాలెం గౌతులచ్చన్న జంక్షన్ లో కాపులతో సమావేశం.
– 5.50 గొర్లవానిపాలెంలో స్థానికులతో భేటీ
– 6.05 చింతలగొర్లవానిపాలెంలో స్థానికులతో ముఖాముఖి.
– 6.15 గొర్లవానిపాలెం లారెన్స్ ల్యాబ్స్ ఎన్క్లేవ్ వద్ద స్థానికులతో సమావేశం.
– 6.25 జాజులవానిపాలెంలో శాలివాహనులతో భేటి
– 6.55 దేశపట్నూరిపాలెంలో స్థానికులతో సమావేశం
– 7.10 స్టీల్ ప్లాంట్ గేటు వద్ద విశాఖ స్టీల్ కార్మికులతో భేటీ