Palla Srinivasa Rao: చార్జీలు భారీగా పెంచి... ప్రజల నడ్డి విరిచారు..
ABN , First Publish Date - 2023-05-24T16:09:14+05:30 IST
విశాఖ: జగన్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ చార్జీలు భారీగా పెంచి ప్రజల నడ్డి విరిచారని విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
విశాఖ: జగన్ ప్రభుత్వ (Jagan Govt.) హయాంలో విద్యుత్ చార్జీలు (Electricity Charges) భారీగా పెంచి ప్రజల నడ్డి విరిచారని విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని.. రూ. 57 వేల కోట్ల భారం ప్రజల మీద పడిందన్నారు. అవినాష్ రెడ్డి (Avinash Reddy) వ్యవహారం అంతా ఒక డ్రామా కంపెనీలా ఉందని, వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో (Viveka Murder Case) సీఎం జగన్ (CM Jagan) ప్రమేయం ఉందని అందరికీ అనుమానాలు ఉన్నాయన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేక పోతోందని ప్రశ్నించారు. హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.