CP Trivikram Varma: విశాఖలో రౌడీషీటర్లపై నిఘా.. రంగంలోకి సీపీ.. రౌడీల పరార్

ABN , First Publish Date - 2023-06-21T12:26:40+05:30 IST

వైజాగ్ నగరంలో రౌడీషీటర్లపై పోలీసుల నిఘా పెరిగింది. ల్యాండ్ సెటిల్మెంట్‌లు, భూ కబ్జాలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

CP Trivikram Varma: విశాఖలో రౌడీషీటర్లపై నిఘా.. రంగంలోకి సీపీ.. రౌడీల పరార్

విశాఖపట్నం: వైజాగ్ నగరంలో రౌడీషీటర్లపై పోలీసుల నిఘా పెరిగింది. ల్యాండ్ సెటిల్మెంట్‌లు, భూ కబ్జాలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగర పరిధిలో ఉన్న ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్‌హెచ్ ఓ స్థాయిలో కౌన్సిలింగ్ జరుగుతున్నప్పటికి రౌడీ షీటర్‌లలో ఎలాంటి మార్పు కనిపించని పరిస్థితి. దీంతో సీపీ త్రివిక్రమ్ వర్మ (CP Trivikram Varma) రంగంలోకి దిగారు. రౌడీ షీటర్లను గాడిలో పెట్టేందుకు సీపీ నడుం బిగించారు. ఏకకాలంలో పెద్ద సంఖ్యలో రౌడీ షీటర్లకు సీపీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో సీపీ రంగంలోకి దిగడంతో చాలా మంది రౌడీలు బెంగుళూరు, ముంబై నగరాలకు పరారయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, కిడ్నాప్‌లపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

సీపీ త్రివిక్రమ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో 280 మంది A కేటగిరీ రౌడీ షీటర్‌లకు కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. రౌడీ షీటర్‌లకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చామని చెప్పారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ప్రతి ఆదివారం రోజు రౌడీ షీటర్‌లకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. బెయిల్‌పై బయటకి వచ్చిన వారు మళ్లీ నేరాలకి పాల్పడితే బెయిల్ క్యాన్సిల్ చేసేలా చూస్తామని సీపీ వెల్లడించారు.

Updated Date - 2023-06-21T12:26:40+05:30 IST