Lokesh YuvaGalam: అచ్యుతాపురంలో ఎస్ఈజెడ్ బాధితులతో లోకేష్ ముఖాముఖి
ABN , Publish Date - Dec 15 , 2023 | 04:53 PM
Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అచ్చుతాపురంలో ఎస్‌ఈజెడ్ బాధితులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. విశాఖలో ఐటీ అభివృద్ధి చేశామని.. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున పరిశ్రమలు విశాఖ నుంచి నడుస్తాయన్నారు.
అనకాపల్లి: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అచ్చుతాపురంలో ఎస్‌ఈజెడ్ బాధితులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. విశాఖలో ఐటీ అభివృద్ధి చేశామని.. టీడీపీ ప్రభుత్వం (TDP Government) వచ్చాక పెద్ద ఎత్తున పరిశ్రమలు విశాఖ నుంచి నడుస్తాయన్నారు. ఈ రోజు వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందన్నారు. ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని వారు ఇప్పుడు సీఎంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అన్న క్యాంటీన్, టిడ్కో ఇల్లు ఇచ్చింది టీడీపీ అని అన్నారు. హుద్ హుద్ తుఫాన్ వస్తే ముందుగా వెళ్ళి ప్రజల కోసం అండగా నిలిచింది చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. పరిశ్రమలు పెట్టినప్పుడు భూములు ఇచ్చిన వారికి నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. పాదయాత్ర అనంతరం అన్ని నియోజక వర్గాలలో పర్యటిస్తానని.. ప్రజా సమస్యలపై మరింత దృష్టి పెడతామని లోకేష్ పేర్కొన్నారు.