Narayanaswamy: చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్ర సహాయమంత్రి నారాయణ స్వామి ఏమన్నారంటే?..

ABN , First Publish Date - 2023-09-26T13:52:28+05:30 IST

స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇప్పటిది కాదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ.నారాయణ స్వామి అన్నారు.

Narayanaswamy: చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్ర సహాయమంత్రి నారాయణ స్వామి ఏమన్నారంటే?..

విశాఖపట్నం: స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇప్పటిది కాదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ.నారాయణ స్వామి (Union Minister Narayana Swamy) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పేరు ఆ రోజు ఎఫ్ఐఆర్లో లేదని తాను విన్నట్లు తెలిపారు. ఎలక్షన్ దగ్గరవుతోన్న సరికి ఆయన పేరు వచ్చిందని.. మళ్లీ ఆ కేసు మళ్లీ ఓపెన్ చేశారన్నారు. చార్జ్ షీట్ ఎలా వేశారో... ఎందుకు అరెస్ట్ చేశారో.. ఆయన పేరు ఎలా వచ్చిందో తనకు తెలీదన్నారు. ఏపీలో కక్ష సాధింపు లేదని తాను చెప్పలేను అంటూ పరోక్షంగా జగన్‌కు చురకలంటించారు. వివాదం కోర్టులో ఉన్న కారణంగా తాను రాజకీయంగా మాట్లాడలేనని నారాయణ స్వామి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T13:57:47+05:30 IST