Velagapudi Ramakrishna Babu : స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మూసివేయడం జగన్ సైకో పాలనకు నిదర్శనం

ABN , First Publish Date - 2023-09-16T13:34:20+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పరిశీలించారు. యూనివర్సిటీలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు ఏయూ అధికారులు తాళం వేశారు.

Velagapudi Ramakrishna Babu : స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మూసివేయడం జగన్ సైకో పాలనకు నిదర్శనం

విశాఖ : ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పరిశీలించారు. యూనివర్సిటీలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు ఏయూ అధికారులు తాళం వేశారు. అనంతరం వెలగపూడి రామకృష్ణ బాబు మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లను మూసివేయడం జగన్మోహన్ రెడ్డి సైకో పాలనుకు ఇది నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని ఆరు జోన్లలో సుమారు రెండు లక్షల మంది శిక్షణ పొందారన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించి స్థిరపడ్డారన్నారు. ఏయూలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను వీసీ ప్రసాద్ రెడ్డి దగ్గరుండి మూయించారన్నారు. ఏయూలో మూసివేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను వెంటనే తెరిపించాలని.. జగన్మోహన్ రెడ్డి ఏ1 అయితే చంద్రబాబు నెంబర్ వన్ అని వెలగపూడి రామకృష్ణబాబు పేపర్కొన్నారు.

Updated Date - 2023-09-16T13:34:20+05:30 IST