DRM Saurabh Prasad : రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నాం
ABN , First Publish Date - 2023-10-30T16:49:55+05:30 IST
జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని వాల్తేర్ రైల్వే డీఆర్ఎమ్ సౌరబ్ ప్రసాద్ ( Walther Railway DRM Saurabh Prasad ) తెలిపారు.
విజయనగరం: జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని వాల్తేర్ రైల్వే డీఆర్ఎమ్ సౌరబ్ ప్రసాద్ ( Walther Railway DRM Saurabh Prasad ) తెలిపారు. సోమవారం నాడు విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. ‘‘ఈ ఘటన నిన్న రాత్రి 7 గంటల సమయంలో జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పురుద్దరణ పనులు జరిగాయి. అనుకున్న ప్రకారం మధ్యాహ్ననానికి ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి చేశాం. నిబంధనల ప్రకారం జరిగిన ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైల్వే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాము. అన్ని విభాగాల సమన్వయంతో పని చేశాయి. సేఫ్టీ కమిషన్ సభ్యులు వచ్చి ఘటనపై విచారణ చేపట్టారు. అధికారుల విచారణ అనంతరం పరిశీలించి నివేదిక ఇస్తారు. ఈ రోజు విచారణ కమిటీ వేస్తున్నాం. విశాఖపట్నం డివిజన్ లోని విచారణ జరుగుతుంది. రిపోర్టు వచ్చిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి. రైలు ప్రయాణించిన ట్రాక్ మాత్రం ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టంతో ఉంది. ’’ అని వాల్తేర్ రైల్వే డీఆర్ఎమ్ సౌరబ్ ప్రసాద్ పేర్కొన్నారు.