Nara Lokesh: టీడీపీ అధికారంలోకి రాగానే చేనేతపై జీఎస్టీ ఎత్తివేస్తాం: లోకేష్
ABN , First Publish Date - 2023-03-09T16:56:12+05:30 IST
టీడీపీ అధికారంలోకి రాగానే చేనేతపై జీఎస్టీ ఎత్తివేస్తామని టీడీపీ నేత లోకేష్ (Nara Lokesh) ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీమా, వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు.
చిత్తూరు: టీడీపీ అధికారంలోకి రాగానే చేనేతపై జీఎస్టీ ఎత్తివేస్తామని టీడీపీ నేత లోకేష్ (Nara Lokesh) ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీమా, వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు. మదనపల్లి (Madanapalli) నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో లోకేష్ పాల్గొన్నారు. ఎనుమువారిపల్లిలో చేనేత కార్మికులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. చేనేత కళాకారులతో కలిసి లోకేష్ రాట్నం తిప్పి నూలు వడికారు. చేనేత రంగం ఎదర్కొంటున్న సంక్షోభాన్ని చేనేత కార్మికులు లోకేష్ దృష్టికి తెచ్చారు. నేతన్నలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, చేనేత వస్త్రాలకు, పవర్లూమ్ వస్త్రాలకు తేడా తెలిసేలా.. ప్రత్యేక లేబిలింగ్ చేయాలని చేనేత కార్మికులు కోరారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగించాలని, ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేయడం లేదని, సిల్క్ రాయితీ పాస్బుక్ను తిరిగి అమలు చేయాలని కార్మికులు కోరారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ వైసీపీ (YCP) పాలనలో నేతన్నలకు గుర్తింపు కార్డులు లేవని తెలిపారు. పవర్లూమ్ వస్త్రాలు, చేనేత వస్త్రాలకు తేడా తెలిసేలా.. లేబిలింగ్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలకు.. ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చారు. నేతన్న నేస్తం కూడా పెద్ద మోసమని విమర్శించారు. సొంత మగ్గాలు ఉన్న వారికే నేతన్న నేస్తం అంటున్నారని, ఆప్కోలో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని విమర్శించారు. చేనేతపై జీఎస్టీ (GST) రద్దుకు ఎంపీలు కృషి చేయడం లేదని లోకేష్ డిమాండ్ చేశారు.
500 కి.మీ పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేష్
నారా లోకేష్ యువగళం పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మదనపల్లి సీటీఎం దగ్గర నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మదనపల్లి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది.