AP News: ఆయనకు ఏమైనా జరిగితే జగన్ రెడ్డి, డీజీపీదే బాధ్యత: పీతల సుజాత
ABN , First Publish Date - 2023-01-11T18:12:52+05:30 IST
టీడీపీ (TDP) నేత ఎం.ఎస్ రాజు అరెస్ట్ ను మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత పీతల సుజాత (Peethala Sujatha) ఖండించారు. దళితుల హక్కుల కోసం ఛలో కావలికి పిలుపునిచ్చిన టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు (Raju)ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం పోలీసు మ్యాన్యువల్‌కు విరుద్ధమన్నారు.
పశ్చిమగోదావరి: టీడీపీ (TDP) నేత ఎం.ఎస్ రాజు అరెస్ట్ ను మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత పీతల సుజాత (Peethala Sujatha) ఖండించారు. దళితుల హక్కుల కోసం ఛలో కావలికి పిలుపునిచ్చిన టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు (Raju)ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం పోలీసు మ్యాన్యువల్‌కు విరుద్ధమన్నారు. ఎంఎస్ రాజుకు ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిదే బాధ్యత అన్నారు. ఎం.ఎస్ రాజు ఎక్కడ ఉన్నారో తెలియకుండా వివిధ మార్గాల్లో తిప్పుతూ కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని వింజమూరు, సీతారామపురం, సోమశిలలోని పలు స్టేషన్లో ఉంచుతూ నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించకుండా గూండాల్లాగా వ్యవహరించడం దారుణమన్నారు. దళితులకు అండగా నిలుస్తుండటాన్ని జీర్ణించుకోలేకే ప్రభుత్వం పోలీసుల్ని అడ్డుపెట్టుకుని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ దళిత ద్రోహిగా మారి అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎంఎస్ రాజును వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.