Pithani: బీజేపీ, వైసీపీ కలసి రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు
ABN , First Publish Date - 2023-10-11T14:21:14+05:30 IST
ప.గో. జిల్లా: మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బీజేపీ, వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్బంగా బుధవారం పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రూర రాజకీయాలకు...
ప.గో. జిల్లా: మాజీ మంత్రి పితాని సత్యనారాయణ (Pithani Satyanarayana) బీజేపీ (BJP), వైసీపీ (YCP)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్బంగా బుధవారం పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) క్రూర రాజకీయాలకు కేంద్రంలోని బీజేపీ వత్తాసు పలుకుతోందని, బీజేపీ, వైసీపీ కలిసి రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. వ్యవస్థలను తన చేతిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ నియంత (Dictator)లా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ బెదిరింపులకు భయపడమని హెచ్చరించారు. చంద్రబాబు (Chandrababu) విడుదల అయ్యేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నర్సాపురంలో 31వ రోజు రిలే దీక్ష చేస్తున్న శెట్టి బలిజ సామాజిక వర్గానికి పితాని సత్యనారాయణ సంఘీభావం తెలిపారు.