Chintamaneni: అవినాష్ రెడ్డి వ్యవహారంపై చింతమనేని ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-05-23T14:22:43+05:30 IST

ఏలూరు జిల్లా: దెందులూరు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏలూరు విద్యుత్ భవన్ ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి.

Chintamaneni: అవినాష్ రెడ్డి వ్యవహారంపై చింతమనేని ఘాటు వ్యాఖ్యలు

ఏలూరు జిల్లా: దెందులూరు తెలుగుదేశం పార్టీ నేత (TDP Leader), మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) ఆధ్వర్యంలో ఏలూరు విద్యుత్ భవన్ ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. విద్యుత్ కార్యాలయంలో వినతి పత్రం అందించి.. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చింతమనేని మీడియాతో మాట్లాడుతూ కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందన్నారు. అందుకే అవినాష్ రెడ్డి అరెస్టు (Avinash Reddy Arrest) విషయంలో సీబీఐ (CBI) కఠిన వైఖరి అవలంభించ లేకపోతోందన్నారు. అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. హత్యా కేసులో నేరస్థుడిని సీబీఐ అరెస్టు చేయలేకపోతున్నదని, సీబీఐని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) బెదిరిస్తున్నారని చింతమనేని ఆరోపించారు.

Updated Date - 2023-05-23T14:22:43+05:30 IST