Nadendla Manohar: కావాలనే వాలంటీర్లను రెచ్చగొడుతున్నారు
ABN , First Publish Date - 2023-07-12T14:52:18+05:30 IST
రాష్ట్రంలో ప్రభుత్వం మారాలనే ఆకాంక్షతో ప్రజలు వారాహి యాత్రకు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారని జనసేన పార్టీ పీఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
పశ్చిమగోదావరి: రాష్ట్రంలో ప్రభుత్వం మారాలనే ఆకాంక్షతో ప్రజలు వారాహి యాత్రకు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారని జనసేన పార్టీ పీఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Janasena Leader Nadendla Manohar) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సమస్యలపైన విమర్శిస్తున్నరూ కానీ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదని స్పష్టం చేశారు. ఎందుకు ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారు అని ప్రశ్నించారు. జనసేన పార్టీ లోతుగా అధ్యయనం చేసిన తరువాత మాత్రమే మాట్లాడుతుందన్నారు. ఎందుకు ఇంత డేటా బేస్ ప్రజల నుంచి కలెక్ట్ చేస్తున్నారో, ఎక్కడికి పంపుతున్నారో ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లు ప్రభుత్వ కార్యకర్తలు కాదా?... కావాలనే వాలంటీర్లను రెచ్చగొడుతున్నారని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.