వివేకా హత్య కేసులో రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం జరగబోతోంది?
ABN , First Publish Date - 2023-06-08T17:43:09+05:30 IST
వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాశ్‌ను చేర్చడం అనేది సీబీఐని కచ్చితంగా
ఢిల్లీ: వైఎస్.వివేకా హత్య కేసులో (Viveka murder case) తాజా పరిస్థితుల్ని చూస్తుంటే సీబీఐ దూకుడు పెంచినట్లుగా తెలుస్తోందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraj) అభిప్రాయపడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడారు. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాశ్‌ను చేర్చడం అనేది సీబీఐని కచ్చితంగా అభినందించాలన్నారు. ఇప్పటి వరకూ అవినాశ్‌ను నిందితుడిగా చేర్చకపోవడం వల్లే బెయిల్ వచ్చి ఉంటుందని.. ఈసారి మాత్రం అరెస్ట్ చేసే ఛాన్సుందని తెలిపారు. అవినాశ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అంతేకాదు ఇంకో నిందితుడిని కూడా చేర్చడానికి సీబీఐ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆ తొమ్మిదో నిందితుడు ఎవరనేది త్వరలోనే తేలిపోనుంది చెప్పుకొచ్చారు. ఈనెలాఖరులోగా సీబీఐ ఈ కేసును ముగించేలోపు తొమ్మిదో నిందితుడు ఎవరో తేల్చనుందన్నారు. ఇక అవినాశ్ బెయిల్ రద్దు చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రేపు ఈ అంశం మెయిన్ అంశంగా రాబోతుందని వెల్లడించారు. అంతేకాకుండా తాజాగా అవినాశ్‌ను నిందితుడిగా చేర్చిన అంశం కూడా సుప్రీంలో ప్రస్తావనకు రావొచ్చన్నారు. సునీత చేస్తున్న పోరాటానికి త్వరలోనే మంచి విజయం రాబోతోందని రఘురామకృష్టంరాజు ఆకాంక్షించారు.