MP Raghurama: ఏపీలో నమోదైన దొంగ ఓట్లపై ఈసీకి ఎంపీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-06-20T17:23:48+05:30 IST

ప్రతి ఒక్కరూ తమ ఓటు కాపాడుకోవాలని ఏపీ ప్రజలకు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. ఏపీలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ ఫిర్యాదు చేశారు.

MP Raghurama: ఏపీలో నమోదైన దొంగ ఓట్లపై ఈసీకి ఎంపీ ఫిర్యాదు

ఢిల్లీ: ప్రతి ఒక్కరూ తమ ఓటు కాపాడుకోవాలని ఏపీ ప్రజలకు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishna Raja) విజ్ఞప్తి చేశారు. ఏపీలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్‌కి లేఖ రాశారు. ఒకే ఇంటిపై అనేక దొంగ ఓట్లు నమోదు చేశారని లేఖలో పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని తెలిపారు. దొంగ ఓట్లకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరకు పని చేస్తున్న వాలంటీర్లు ఓటర్ల నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారని, వాలంటీర్ల వ్యవస్థను ముందు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో దొంగ ఓట్లు నమోదు అయ్యాయిని రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఒప్పుకున్నారని లేఖలో రఘురామ గుర్తుచేశారు.

Updated Date - 2023-06-20T17:23:48+05:30 IST