Atchannaidu: వైసీపీ నుంచి కొత్త ఆఫర్...

ABN , First Publish Date - 2023-05-23T13:57:41+05:30 IST

వైసీపీ నుంచి కొత్త ఆఫర్ వచ్చిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఆరుగురం వస్తామని.. అయితే ఒకరికి మాత్రమే టిక్కెట్ ఇవ్వాలని అడుగుతున్నారని ఆయన తెలిపారు.

Atchannaidu: వైసీపీ నుంచి కొత్త ఆఫర్...

అమరావతి: వైసీపీ (YCP) నుంచి కొత్త ఆఫర్ (New offer) వచ్చిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. వైసీపీ నుంచి టీడీపీ (TDP)లోకి ఆరుగురం వస్తామని.. అయితే ఒకరికి మాత్రమే టిక్కెట్ ఇవ్వాలని అడుగుతున్నారని ఆయన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా, కాళ్లమండలం, పెదఅమిరంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆధ్వర్యంలో జరిగిన మినీ మహనాడు కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అందరికీ టిక్కెట్లు ఇవ్వమని అడగడంలేదని... ఇదీ వైసీపీ పరిస్థితి అని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు వస్తున్నాయని తెలిపారు. ఎన్నికలకు అందరూ సిద్ధం ఉండాలని సూచించారు. వైసీపీకి డిపాజిట్లు (Deposits) రాకుండా చేసి టీడీపీకి ఘన విజయం సాధించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అచ్చెన్నాయుడు అన్నారు.

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో టీడీపీ పోటీ చేయాలంటూ సీఎం జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ నాయకులు వ్యాఖ్యానించడాన్ని అచ్చెన్నాయుడు ఖండించారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు జగన్‌వా అంటూ నిలదీశారు. డిసెంబర్‌లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, తెలుగుదేశం, జనసేన కలిసే ముందుకు వెళ్తాయని కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. ‘అధికార పార్టీని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. హింసలు పెడుతున్నారు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. టీడీపీ, జనసేన కలుస్తాయని తెలిసినప్పటి నుంచి జగన్మోహన్‌రెడ్డి నిద్రలేని రాత్రులు గడుతున్నారు. కేంద్రం రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేస్తే జగన్‌కి కంటి మీద కునుకు మరింత కరువైంది’ అంటూ అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. విశాఖపట్టణాన్ని రాజధాని చేస్తానంటే వ్యతి రేకించిన తొలి వ్యక్తిని తానేనంటూ చెప్పారు. రాజధానితో అభివృద్ధి చెందుతుందంటూ ఉత్తరాంధ్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం చేశారన్నారు. విశాఖలో ప్రజలు తమ ఆస్తులు కాపాడుకోవడానికి నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - 2023-05-23T13:57:41+05:30 IST