TDP: అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితురాలికి ఆర్థిక సాయాన్ని అందించిన టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2023-04-21T19:23:19+05:30 IST
అగ్నిప్రమాదంలో పూర్తిగా ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబానికి నారా లోకేష్ సేవ సమితి తరుపున ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు (Akumarthi Rama Rao) 25 కేజీల బియ్యం, బట్టలు, రూ.10,000 ఇచ్చారు.
ఏలూరు జిల్లా: అగ్నిప్రమాదంలో పూర్తిగా ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబానికి నారా లోకేష్ సేవ సమితి తరుపున ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు (Akumarthi Rama Rao) 25 కేజీల బియ్యం, బట్టలు, రూ.10,000 ఇచ్చారు. బాధితులకు ఏలూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మాగంటి బాబు (Maganti Babu) బట్టలు, వంట సామగ్రి అందజేశారు. అగ్నిప్రమాద ఘటన చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి మండలం పగడవరం గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో తమ్మిశెట్టి సరోజిని (BC) ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
ఈ కార్యక్రమంలో తాళ్ళూరి చంద్రశేఖర్ రెడ్డి, కనమత రెడ్డి రాజారెడ్డి, కొనకళ్ళ రాజు, కొప్పిరల నాగరాజు, జె.శీనువాస రెడ్డి, చిన్నరావు, మహలక్షడు, నాగేష్, మారేస్, చెన్నారావు, కేసవ, వేంకటేశ్వర రావు, జయరాజు, బుద్ధల నాగు, ఏడుకొండలు ప్రసాద్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.