Boragam Srinivasulu: వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు
ABN , First Publish Date - 2023-05-07T17:15:10+05:30 IST
కొయ్యలగూడెం మండలం గవరవరంలో ఇటీవల కురిసిన వర్షాలకు తడిచిన మొక్కజొన్న పంటను పోలవరం నియోజకవర్గం టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) పరిశీలించారు.
ఏలూరు జిల్లా: కొయ్యలగూడెం మండలం గవరవరంలో ఇటీవల కురిసిన వర్షాలకు తడిచిన మొక్కజొన్న పంటను పోలవరం నియోజకవర్గం టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) పరిశీలించారు. రైతులను పరామర్శించిన బొరగం శ్రీనివాసులు వర్షాలతో దెబ్బతిన్న పంటనష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులను అధైర్య పడవద్దని టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. ఇటీవల చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి పంట నష్టం అంచనా వేసి వెంటనే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులకు అండగా నిలిచి తీవ్ర ఆందోళన చేపడతామని డెడ్‌లైన్ విధించిన విషయాన్ని రైతులకు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు యాగంటి హరిబాబు, మండల ప్రధాన కార్యదర్శి బొబ్బర రాజు, క్లస్టర్ ఇంచార్జ్ నాయుడు లిలాకాంత్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఉప్పాటి వెంకట్రావు, అమలాపురపు తాతారావు, తెలుగుయువత పార్లమెంట్ కార్యదర్శి నల్లూరి గోపికృష్ణ, మాజీ సర్పంచ్ మల్లవరపు త్రిమూర్తులు, నల్లురి రామకృష్ణ, నల్లా నాగేశ్వరరావు, రాచూరి సీతారామయ్య, కొడమంచి కృష్ణ, కూనపాం రామారావు, నల్లూరి సోమరాజు, పోలవరపు సిద్దారావు, షేక్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు.