Yarlagadda Venkatrao: గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా యార్లగడ్డ

ABN , First Publish Date - 2023-08-23T14:12:37+05:30 IST

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా యార్లగడ్డ వెంకట్రావ్ నియమితులయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు వెంకట్రావ్‌ను గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా నియమిస్తున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

Yarlagadda Venkatrao: గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా యార్లగడ్డ

అమరావతి: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా యార్లగడ్డ వెంకట్రావ్ (Gannavaram TDP Incharge Yarlagadda Venkatrao) నియమితులయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu)ఆదేశాల మేరకు వెంకట్రావ్‌ను గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా నియమిస్తున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.


ఇప్పటికే లోకేశ్ ప్రకటన...

గన్నవరం నియోజకవర్గంలో బుధవారం యార్లగడ్డ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (TDP Leader Nara Lokesh) సమక్షంలో పెద్దఎత్తున వైసీపీ నేతలు, శ్రేణులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా యార్లగడ్డ వెంకట్రావు‌ను నియమిస్తున్నట్లు లోకేశ్ ప్రకటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు‌ను గెలిపించి పసుపు జెండా ఎగరేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. యార్లగడ్డతో పాటు తెలుగుదేశంలో చేరేందుకు వచ్చిన వారందరికీ పసుపు కండువాలు కప్పి యువనేత సాదరంగా ఆహ్వానించారు. అయితే గన్నవరంలో లోకేశ్‌ ప్రసంగిస్తుండగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో జై లోకేష్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ టీడీపీ శ్రేణులు సెల్ ఫోన్ టార్చ్‌లు వేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కూడా సరిగా చేయలేని ప్రిజనరీకి, ముందు చూపుతో విద్యుత్ సమస్యలు పరిష్కరించి విజనరీకి ఇదే తేడా అంటూ లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. పిల్లసైకో వంశీని రాజకీయాల నుంచి శాశ్వతంగా బాహీష్కరించేందుకు అంతా కలసికట్టుగా పనిచేయాలన్నారు. గన్నవరంలో ప్రతీ తెలుగుదేశం కార్యకర్తను కాపాడుకునే బాధ్యత లోకేశ్‌ తీసుకుంటారన్నారు. తన గెలుపు కోసం కష్టపడిన తెలుగుదేశం శ్రేణులపైనే తప్పుడు కేసులు కేసి పెట్టించి మరీ వేధిస్తున్న పిల్ల సైకో వంశీ అంటూ మండిపడ్డారు. పార్టీ మారే ముందు కూడా పట్టిసీమ లేకుంటే గన్నవరంలో బాత్రూమ్ కడిగేందుకు కూడా నీళ్లు ఉండేవి కాదంటూ వంశీ ఎంతో నటించారన్నారు. కనీసం పేరు కూడా సరిగా తెలియని గన్నవరం పిల్లసైకోకి ఓసారి ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం బీఫామ్ ఇచ్చిందన్నారు. మంగళగిరిలో ఓటమే తనలో కసి పెంచిందన్నారు. తరచూ ఓడిపోతున్న మంగళగిరి ఇప్పుడు తెలుగుదేశం కంచుకోటగా మారిందన్నారు. ఇక్కడున్న పిల్ల సైకోని, పక్క నియోజవర్గo గుడివాడలో సన్న బియ్యం సన్నాసిని ఓడించాలంటూ వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఇన్ఛార్జ్‌గా చనిపోయే వరకూ బచ్చుల అర్జనుడు అంకితభావంతో కృషి చేశారన్నారు. శాసనమండలిలో తనతో పాటు బచ్చుల అర్జునుడు, మంతెన సత్యనారాయణ రాజు మూడు రాజధానుల బిల్లు అడ్డుకోవడంలో ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. బచ్చుల అర్జనుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉండి వారిని రాజకీయంగా పైకి తీసుకొస్తుందని లోకేశ్ భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-08-23T14:29:51+05:30 IST