MLC Elections: మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో విందు సమావేశాలు..!

ABN , First Publish Date - 2023-03-19T17:32:22+05:30 IST

ఈనెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Quota MLC Elections) నిర్వహిస్తారు. 7 ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

MLC Elections: మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో విందు సమావేశాలు..!

అమరావతి: అమరావతి: ఈనెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Quota MLC Elections) నిర్వహిస్తారు. 7 ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పట్టభద్రులు ఎమ్మెల్సీలో వైసీపీకి చుక్కెదురు కావడంతో.. ఎమ్మెల్యేలతో విందు రాజకీయాలకు వైసీపీ తెరలేపింది. మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరించారు. మార్చి 23వ తేదీన పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ కూడా జరగనుంది. మార్చి 25వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. నారా లోకేశ్‌, చల్లా భగీరథరెడ్డి (Nara Lokesh Challa Bhagirath Reddy), పోతుల సునీత, బచ్చుల అర్జు నుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పెనుమత్స సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. దీంతో ఆ స్థానాల భర్తీకి ఈసీ షెడ్యూల్‌ ప్రకటించింది.

మరోవైపు అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, అనంతపురం, కడప, నెల్లూరు (Anantapur Kadapa Nellore), చిత్తూరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మరో 4(పశ్చిమగోదావరిలో రెండు స్థానాలు, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులకు పోటీగా అభ్యర్థులు బరిలో నిలవడంతో ఈ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో పి.రామసుబ్బారెడ్డి(వైసీపీ) ఏక గ్రీవం అయ్యారు. అలాగే, ఉమ్మడి తూర్పుగోదావరి జి ల్లా స్థానిక సంస్థల కోటాలో కుడుపూడి సూర్యనారాయణ(వైసీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - 2023-03-19T17:35:56+05:30 IST