Share News

Chandrababu Arrest: జైలు ఏమన్నా అత్తగారిల్లా ఏసీ పెట్టడానికి?: సజ్జల

ABN , First Publish Date - 2023-10-13T15:14:04+05:30 IST

రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేయకపోతే నిలదీయాలి గానీ ఇలా చేయడం దారుణమని.. జైలు అత్తగారిల్లా ఏసీ పెట్టడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును పట్టకున్న పోలీసులు, జైలు వాతావరణం, ఖైదీలు, డాక్టర్‌ల మీద, ప్రభుత్వం మీద, సీఎం మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Chandrababu Arrest: జైలు ఏమన్నా అత్తగారిల్లా ఏసీ పెట్టడానికి?: సజ్జల

అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ఆరోగ్యంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Government Adviser Sajjala Ramakrishna Reddy) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేయకపోతే నిలదీయాలి గానీ ఇలా చేయడం దారుణమని.. జైలు అత్తగారిల్లా ఏసీ పెట్టడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును పట్టకున్న పోలీసులు, జైలు వాతావరణం, ఖైదీలు, డాక్టర్‌ల మీద, ప్రభుత్వం మీద, సీఎం మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జైల్లో చంద్రబాబు అందరూ అంటున్నట్టు ఐదుకేజీలు తగ్గలేదు.. ఒక కేజీ పెరిగారన్నారు. అదేమంటే చివరకు ఆ వేయింగ్ మిషన్‌ను తప్పు పడతారని అన్నారు. జైల్లో వేలమంది ఖైదీలు ఉంటారని ఏ రకంగా చంద్రబాబు ప్రత్యేక ఖైదీ అవుతారని ప్రశ్నించారు. రాజమండ్రిలో ఉష్ణోగ్రతలు పెరిగితే ఆయనకు ఒక్కడికే ఉక్కపోత ఉంటుందా.. ఆయన ఎందుకో చొక్కా విప్పరు, ఏదో సమస్య ఉంది అందువల్ల డీహైడ్రేషన్‌కు గురై ఉండొచ్చంటూ... తన వ్యాఖ్యల ద్వారానే జైల్లో చంద్రబాబు ఉక్కపోతకు గురవుతున్నారని సజ్జల అంగీకరించారు.


బాబు కోసం ప్రత్యేకంగా ట్యాంకర్ కట్టించాలా?...

సజ్జల ఇంకా మాట్లాడుతూ.. ‘‘అసలు చంద్రబాబుకు ప్రత్యేకంగా స్నేహా బ్యారక్ ఎందుకు ఏర్పాటు చేశారు. డాక్టర్‌లను 24 గంటలు 7 రోజులు అక్కడే ఉంచుతున్నాం. ఆయన భార్య పెట్టే ఫుడ్‌లో ఏం పెడుతున్నారో వెయిట్ లాస్ అంటున్నారు. ఇంటి నుంచి తెచ్చే ఫుడ్‌లో ఏం ఉందో అని టెస్ట్ చేసి పెడుతున్నాం. కారణం దానిలో ఏదైనా కలిపి స్వల్ప అనారోగ్యం అని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తారనే ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. చంద్రబాబు భార్య భువనేశ్వరి నీరు అపరిశ్రుభ్రంగా ఉందని అంటున్నారు. అంటే వారికి ప్రత్యేకంగా ట్యాంకర్ కట్టించాలా. చంద్రబాబును ఎట్లాగో ఓ లాగా బయటకు తేవాలి.... ఆసుపత్రిలో జాయిన్ చేయాలి. అక్కడ సెక్యూరిటీ లేదని హైదరాబాద్‌లోని హస్పటల్‌లో జాయిన్ అవుతారు. రిమాండ్‌లో ఉన్నా అది ఓ శిక్షే. చంద్రబాబు కోసం తట్టలు కొట్టాలా, లైట్లు వెలిగించాలా. చిల్లర పైరవీలు చేసుకుంటున్నారు చంద్రబాబు. జైల్లో కుషన్ బాగుండాలి.... ఏసి పెట్టించుకోవాలి అని చూస్తున్నారు. బీజేపీ కాళ్లు పట్టుకోవడానికి నీ బంధువులను ఉపయోగించుకోవడం నువ్వు చేస్తున్నావు. ఒక పక్క బింకంగా మాట్లాడడం... ఇంకో పక్క అయిపోయింది నా పరిస్ధితి ఎప్పుడు పోతాడో తెలియదు అని మాట్లడడం దారుణం. మీడియా ద్వారా సరైన విధంగా వెళ్లకపోతే నిజంగా తాము రాచి రంపాన పెడుతున్నట్టు భావిస్తారు. చంద్రబాబు ఆయన ఓ ఖైదీ.. ఖైదీలు అందరూ ఎలా ఉంటారో ఆయన అలానే ఉంటారు. చంద్రబాబు తప్పు చేశాడు కనుకే ఆయన్ను జైల్లో పెట్టారు’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-10-13T15:14:04+05:30 IST