YCP Leaders: సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో వైసీపీ నేతల హల్‌చల్
ABN , First Publish Date - 2023-11-09T17:39:26+05:30 IST
పామర్రులో సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో వైసీపీ నేతలు హల్ చల్ చేస్తున్నారు. యాత్ర జరిగే ఎన్టీఆర్ సర్కిల్లో, పార్టీ జెండాలు పెట్టుకునేందుకు మొక్కల పైభాగాన్ని వైసీపీ నేతలు నరికేశారు. బస్సు యాత్రకు ఇబ్బంది కలగకుండా, పామర్రు - విజయవాడ రహదారిని వైసీపీ నేతలు బ్లాక్ చేశారు.

కృష్ణా జిల్లా: పామర్రులో సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో వైసీపీ నేతలు హల్ చల్ చేస్తున్నారు. యాత్ర జరిగే ఎన్టీఆర్ సర్కిల్లో, పార్టీ జెండాలు పెట్టుకునేందుకు మొక్కల పైభాగాన్ని వైసీపీ నేతలు నరికేశారు. బస్సు యాత్రకు ఇబ్బంది కలగకుండా, పామర్రు - విజయవాడ రహదారిని వైసీపీ నేతలు బ్లాక్ చేశారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వైసీపీ నేతల తీరుపై పామర్రు పోలీసులకు టీడీపీ ఇన్‌ఛార్జ్ వర్ల కుమార్ రాజా ఫిర్యాదు చేశారు. ప్రజలను కష్టపెట్టడానికైనా వైసీపీ బస్సు యాత్ర అని కుమార్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం లేని బస్సు యాత్రల వల్ల ఎవరికి ఉపయోగమని, పోలీసులు తక్షణం స్పందించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కుమార్ రాజా డిమాండ్ చేశారు.