మంత్రి పెద్దిరెడ్డిని అడ్డుకున్న వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2023-09-13T13:29:33+05:30 IST
శాంతిపురం మండలం మొరసనపల్లి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్న వైసీపీలోని ఓ వర్గం నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ఆయనను అడ్డుకున్నారు.
చిత్తూరు : శాంతిపురం మండలం మొరసనపల్లి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్న వైసీపీలోని ఓ వర్గం నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ఆయనను అడ్డుకున్నారు. మొరసన పల్లి పంచాయతీలో కోట్లాది రూపాయలు విలువ చేసి ప్రభుత్వ భూమిని స్థానికంగా ఇద్దరు వైసీపీ నాయకులు ఆక్రమించుకోవడంపై.. మరో వర్గం వైసీపీ నాయకులు, ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమస్య పరిష్కరించే వరకూ కబ్జాకు గురైన స్థలం వద్దే నిరసన చేపడతామంటూ మొరసనపల్లి గ్రామస్తులతో పాటు వైసీపీలోని ఓ వర్గం రోడ్డుపై బైఠాయించింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తులకు సమాధానం చెప్పకుండా గుడిపల్లి మండలంలో ఓ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి వెళ్లిపోయారు. తిరుగు ప్రయాణంలో ఆయన్ని అడ్డుకోవాలని వైసీపీలోని ఓ వర్గం, గ్రామస్తులు రోడ్డుపైనే బైఠాయించారు.