Share News

YCP Minister: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గుండెకు శస్త్ర చికిత్స విజయవంతం

ABN , First Publish Date - 2023-11-11T20:44:26+05:30 IST

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు వైద్యులు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స చేశారు.

YCP Minister: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గుండెకు శస్త్ర చికిత్స విజయవంతం

హైదరాబాద్: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు వైద్యులు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స చేశారు. శృంగవరపుకోటలో జరిగిన వైసీపీ బస్సు యాత్రలోనే మంత్రి బొత్స అస్వస్ధతకు గురయ్యారు. గుండె సంబంధిత వ్యాధితో గత వారం రోజుల నుంచి మంత్రి బొత్స ఇబ్బంది పడుతున్నారు.

విశాఖలో వైద్య పరీక్షలు అనంతరం మెరుగైన చికిత్స కోసం మంత్రి బొత్సను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. నెల రోజుల వరకు హైదరాబాద్ ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్య బృందం సూచించింది.

Updated Date - 2023-11-11T20:51:41+05:30 IST