YCP minister Botsa: బొత్స ముందే శృంగవరపుకోట వైసీపీలో వర్గపోరు.. మంత్రి ఎలా స్పందించారంటే.. | YCP minister Botsa Satyanarayana react war in YCP RVRAJU

YCP minister Botsa: బొత్స ముందే శృంగవరపుకోట వైసీపీలో వర్గపోరు.. మంత్రి ఎలా స్పందించారంటే..

ABN , First Publish Date - 2023-04-08T22:34:40+05:30 IST

వైసీపీ (YCP)లో వర్గపోరుతో రోజురోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి.

YCP minister Botsa: బొత్స ముందే శృంగవరపుకోట వైసీపీలో వర్గపోరు.. మంత్రి ఎలా స్పందించారంటే..

విజయనగరం: వైసీపీ (YCP)లో వర్గపోరుతో రోజురోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ముందే శృంగవరపుకోట వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తన ఎదుటే వైసీపీ నేతలు వర్గవిభేదాలను బయటపెట్టడంతో మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధిపత్య పోరు మూలంగా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నేతలను మంత్రి హెచ్చరించారు. బాధలు మీకేనా..? తమకు లేవా అని నియోజకవర్గం నేతలపై మంత్రి బొత్స మండిపడ్డారు. కష్టసుఖాలుంటే ఓ చోట కూర్చొని మాట్లాడుకోవాలని, ఎక్కడపడితే అక్కడ పార్టీ గురించి మాట్లాడాలంటే బుద్ధి ఉండాలని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల ఆధిపత్య పోరు మూలంగా గుడివాడ మండలం మోటూరులో సచివాలయ భవనం శిథిలమయ్యేలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలని ఒక వర్గం ప్రయత్నిస్తుంటే ఆపేందుకు మరో వర్గం మోకాలడ్డుతోంది. మండలంలోని మోటూరులో సచివాలయ భవన నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతోంది. గ్రామంలో ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్న వైసీపీకి చెందిన రెండు వర్గాల మూలంగా సచివాలయ భవనం ప్రారంభానికి నోచుకోలేకపోతోంది. ఇతర పంచాయతీల్లో ఇప్పటికే ఆలస్యంగా శంకుస్థాపనలు చేసినా.. భవన నిర్మాణాలు పూర్తయి పాలన కూడా సాగుతోంది. వైసీపీ గ్రూపు తగాదాల నేపథ్యంలో భవనాన్ని ప్రారంభించాలని ఒక వర్గం ప్రయత్నిస్తుంటే... కాదని మరో వర్గం అడ్డుపడుతోంది. పాత పంచాయతీ కార్యాలయంలో ఇరుకు గదుల్లోనే విధులు నిర్వర్తించాల్సి వస్తోందని సచివాలయ సిబ్బంది వాపోతున్నారు.

భవనం చుట్టూ చెత్తాచెదారం

కొత్త సచివాలయ భవనం లోపలంతా చెత్తా చెదారం పేరుకుపోయింది. లోపల పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించడానికి కూడా పంచాయతీ పాలకవర్గం ఉపక్రమించడం లేదంటే ఇరు వర్గాల మధ్య ఆదిపత్య పోరు ఏ స్థాయిలో నడుస్తోందో చెప్పవచ్చు. కేవలం శిలాఫలకంపై ఒక వర్గం వ్యక్తుల పేర్లు పెట్టడం ఇష్టం లేక సచివాలయ భవనాన్ని ప్రారంభించకుండా ఇంకో వర్గం అడ్డుపడుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-04-09T16:48:22+05:30 IST