Botsa: ఆ ముగ్గురిపై బొత్స సంచలన వ్యాఖ్యలు.. ప్రత్యేక హోదాను ఎవరు తాకట్టు పెట్టారో చంద్రబాబు చెప్పాలి
ABN , First Publish Date - 2023-08-19T18:10:40+05:30 IST
ప్రత్యేక హోదాను ఎవరు తాకట్టు పెట్టారో చంద్రబాబు చెప్పాలంటూ బొత్స ఫైరయ్యారు.
విశాఖపట్నం: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ యువనేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"గత కొన్ని రోజులుగా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మీద ఆడి పోసుకుంటున్నారు. చంద్రబాబు కొడుకు పరిజ్ఞానం లేదు. సెలబ్రేట్ అయినందుకు ఆయనే గొప్పగా ఊహించుకొని మాట్లాడతాడు. చంద్రబాబు ఎందుకు సహనం కోల్పోవాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. నోటికి ఏం మాటలు వస్తే మాటలు మాట్లాడుతున్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది నాలికా..తాటి మట్టా. ప్రజాక్షేత్రంలో నాయకుడు అయ్యే ఆలోచన పవన్‌కు లేనట్లుంది. ఎవరో స్క్రిప్ట్ ఇచ్చింది చదువుతున్నారు. ఆయన భగవంతుని, ముని పుంగువుడిని, అన్ని శక్తులు నాకే ఉన్నాయని, అమాయక పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. పరిపక్వత, లేని రాజకీయ పార్టీ నాయకుడు అడిగిన దానికి మేము సమాధానం చెప్పాలా. పవన్ కళ్యాణ్.. చంద్రబాబు పాలన బాగుందని చెప్తున్నారు. ఏం బాగుందో చెప్పండి. దీనికి కొలమానం ఏమిటి. ఏ ప్రాంతానికి వెళ్లినా ఒక్క ఉదాహరణ అయినా చెప్పారా.. అప్పటి పాలనకి పరిపాలనకు తేడా చెప్పారా. నీకు.. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఈ కేకలు అరుపులు అన్నీ కొత్త అమావాస్య వరకు మాత్రమే ఉంటాయి. తర్వాత అయిపోతాయి. ఉన్నవి లేనివి మాట్లాడితే మేమే సమాధానం చెప్పాలా. ప్రజల సొమ్ముతోనే, ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు ప్రయత్నం చేస్తుంది. నీలాగా, దళారులు, మధ్యవర్తులు పెట్టి దోచుకుని తినలేదు. చంద్రబాబు ఏపీలో ఇల్లు ఉందా. ప్రత్యేక హోదాను ఎవరు తాకట్టు పెట్టారు చంద్రబాబు చెప్పాలి. రుషికొండలో ప్రభుత్వ భవనాలు ప్రభుత్వం నిర్మిస్తుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి." అని మంత్రి బొత్స ప్రశ్నించారు.