Avinash Vs CBI: అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమని భావిస్తున్న వేళ అనూహ్య పరిణామం... రేపు..
ABN , First Publish Date - 2023-05-22T19:13:01+05:30 IST
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka murder case) నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) అరెస్ట్‌కు సీబీఐ (CBI) సన్నద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఢిల్లీ: మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka murder case) నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) అరెస్ట్‌కు సీబీఐ (CBI) సన్నద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్ట్ వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో (Supreme court) ఆయన పిటిషన్ వేశారు. తన తల్లి అనారోగ్యం కారణంగా వారంపాటు సీబీఐ విచారణకు హాజరుకాకుండా మినహాయింపునివ్వాలని ఆయన అభ్యర్థించారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తన బెయిల్ పిటిషన్‌ను వినేవరకు తనను అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని కోరారు. అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు (మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
విశ్వభారతి హాస్పిటల్‌కు వైఎస్ విజయమ్మ
ఏపీ సీఎం జగన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి కర్నూలు వెళ్లారు. అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని ఆమె పరామర్శించారు. అవినాశ్‌ను అడిగి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. అవినాశ్ చుట్టూ కర్నూలులో టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆమె కర్నూలు వెళ్లడం గమనార్హం.