Viveka case: హైకోర్టులో ముగిసిన ఇవాళ్టి విచారణ.. అవినాశ్ లాయర్‌కు 5 గంటలు.. సునీతా లాయర్‌కు గంట !
ABN , First Publish Date - 2023-05-26T18:43:57+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ్టి విచారణ ముగిసింది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) సీబీఐ నిందితుడిగా చేర్చిన వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ్టి విచారణ ముగిసింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అవినాశ్‌రెడ్డి తరపు న్యాయవాది వాదనలు ముగిశాయి. అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ రావు ఐదున్నర గంటల పాటు వాదనలు వినిపించారు. సునీత తరపు న్యాయవాది వాదనలు కూడా ముగిశాయి. సునీత తరపు న్యాయవాది సుమారు గంటసేపు వాదనలు వినిపించారు. రేపు ఉదయం 10.30 గంటలకు సీబీఐ వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.
అవినాశ్ తరపు న్యాయవాది వాదనలు:
* 2020 నుండి సీబీఐ ఈ కేస్ దర్యాప్తు చేస్తునే ఉంది
* ఇంకొన్ని నెలలు గడుస్తే 4 సంవత్సరాలు అవుతోంది.
* అనుమానితులు అందరూ వైసీపీ పార్టీకి చెందిన వారు
* ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ సర్వ సాధారణం
* ఫోన్ కాల్స్ ఆధారంగా చూపించి అవినాష్ ను ఇరికించాలని చూస్తున్నారు
* 4 కారణాలు చూపించి అవినాష్ రెడ్డిని అనుమానిస్తున్నారు
* 2017 ఎలక్షన్ , 2019 ఎంపి ఎలక్షన్ క్యాండిడేట్ కారణమని సిబిఐ చెబుతుంది
*2017 లో వివేకా ఓడిపోవడానికి అప్పటి ఎంపిటిసి, జెడ్పీటీసీలు కారణం
* ఈ స్టేట్మెంట్ రవీంద్రా రెడ్డి ఇచ్చారు
* ఇప్పటి వరకు ఈ కేస్ లో సిబిఐ 46 లక్షలు 17 వేలు రికవరీ చేసింది - అవినాష్ న్యాయవాది
* ఆ డబ్బు గురించి సిబిఐ ఎందుకు దర్యాప్తు చెయట్లేదు
* సిట్‌పై నమ్మకం లేక సీబీఐతో విచారించాలని 5 పిటిషన్లు వేశారు
* ఇందులో భాగంగా కోర్టు సీబీఐకి కేసు అప్పగించింది
* కోర్టు ఎంతో నమ్మకంతో సీబీఐకి కేసు అప్పగించింది
* కోర్టు నమ్మకాన్ని సీబీఐ నిలబెట్టుకోలేదు
* అప్పటి ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాలనే పరిగణలోకి తీసుకుని కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది
* 9/7/2020 సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది
* 10/06/21 మొదటి సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది
* 28/03/2019 లో గంగిరెడ్డినీ సిట్ అరెస్ట్ చేసింది
* 2/8/21 సునీల్ యాదవ్ ను సిబిఐ అరెస్ట్ చేసింది
* 09/09/21 ఉమా శంకర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది
* దస్తగిరిని సిబిఐ ఎప్పుడు అరెస్ట్ చేసింది ? - హై కోర్టు
* దస్తగిరి అరెస్ట్ ఈ కేసుకు చాలా కీలకం
* దాని గురించి మళ్ళీ వివరిస్తాను - అవినాష్ న్యాయవాది
* ఈ నలుగురు నిందితులు వివేకాను హత్య చేశారు - అవినాష్ న్యాయవాది
* కోటి రూపాయలు సునీల్ యాదవ్ దస్తగిరికి ఇచ్చినట్లు చెప్పారు
* ఇందులో నుంచి సునీల్ యాదవ్ 25 లక్షలు తీసుకున్నాడు అన్నారు
* కానీ దస్తగిరి దగ్గర 46లక్షలు 70 వేలు మాత్రమే రికవరీ చేశారు...
* మిగతా వాటికి ఇప్పటి వరకు ఎక్కడా లెక్క చూపలేదు
* సునీల్ యాదవ్ దగ్గర అసలు రికవరీ చేయలేదు
* అసలు మృతిచెందిన రోజే హత్య కేసు నమోదు అయింది...
* ముందు హార్ట్ ఎటాక్ అని చెప్పినంత మాత్రాన కేసు ఏమి ఆ దిశగా వెళ్ళలేదు కదా
* అదే రోజు హత్య కేసు నమోదు చేశారు
* అదే రోజు ఐ.పి.సి 201 (డిస్ట్రాక్షన్ ఆఫ్ ఏవిడెన్స్) కేసు నమోదు చేశారు
* కానీ సి.బి.ఐ నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ లో 201 లేనే లేదు
* ముందుగా ఉన్న రికార్డు ల ను బట్టి మొదట ఎఫ్.ఐ.ఆర్ చేసాం...
* తర్వాత ఎఫ్.ఐ.ఆర్ రీ రిజిస్ట్రర్ చేసినప్పుడు 201 యాడ్ చేశామని సి.బి.ఐ న్యాయవాది చెప్పారు
* సిబిఐ నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ లో 201 సెక్షన్ లేదు
* మొదట లోకల్ పోలీసులు 174 కింద ఎఫ్ ఐ ఆర్ చేశారు
* సిబిఐ ఒక నమోదు చేసే ముందు పాత ఎఫ్ ఐ ఆర్ ను రీ రిజిస్టర్ చేయాలి
* కానీ సిబిఐ ఎఫ్ ఐ ఆర్ లో ఎక్కడా 174 సెక్షన్ లేదు
* సిబిఐ ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేసే ప్రకియా ఏంటి ? - సిబిఐ కి హైకోర్టు ప్రశ్న
* పాత ఎఫ్ ఐ ఆర్ ను ఆధారంగా చేసుకునే ఎఫ్ ఐ ఆర్ చేస్తాం - సిబిఐ న్యాయవాది
* పాత ఎఫ్ ఐ ఆర్ తో పాటు కంటెంట్ కూడా ప్రాథమికంగా చేసుకుంటాం - సిబిఐ న్యాయవాది
* కోర్టు సీబీఐకి బదిలీ చేసిన 4 నెలలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు - అవినాష్ న్యాయవాది
హైకోర్టు ప్రశ్నలు-సీబీఐ సమాధానాలు:
* రూ. 46 లక్షలు ఎవరి నుండి రికవరీ చేశారు - హైకోర్టు
* మున్నా లాకర్ నుండి రికవరీ చేశాం - సిబిఐ
* మున్నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారా - హైకోర్టు
* మున్నా లాకర్ నుండి ఎప్పుడు రికవరీ చేశారు?? - హైకోర్టు
* డబ్బు రికవరీ చేసిన డేట్ గురించి ఛార్జ్ షీట్ లో పెట్టారా - హైకోర్టు
* ఛార్జ్ షీట్ లో నగదు స్వాధీనం గురించి పెట్టలేదు - సీబీఐ
* ఎందుకో ఛార్జ్ షీట్‌లో పెట్టలేదో తరువాత వివరణ ఇస్తాం - సీబీఐ
అవినాష్ న్యాయవాది వాదనలు:
* 25/8/21 నుండి 30/8/21 వరకు దస్తగిరి స్టేట్మెంట్ లు సిబిఐ రికార్డ్ చేస్తూనే ఉంది
* దస్తగిరి నుండి మూడు 161 స్టేట్మెంట్ లు సిబిఐ రికార్డ్ చేశారు
* నెలన్నర రోజులు దస్తగిరి సిబిఐ కస్టడీలో ఉన్నాడు
* దస్తగిరి కి ఎప్పుడు బెయిల్ వచ్చింది? - హైకోర్టు
* దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాకే ముందోస్తు బెయిల్ వచ్చింది - అవినాష్
* దస్తగిరి స్టేట్మెంట్ తరువాతే ఏ - 3 అరెస్ట్ జరిగింది
* 7/10/2021 నాడు దస్తగిరి బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేశాడు
* దస్తగిరికి యంటీసిపెటరీ బెయిల్ కు సిబీఐ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు - అవినాష్ న్యాయవాది
* 25/8/21 నుండి 30/8/21 వరకు దస్తగిరి స్టేట్మెంట్ లు సిబిఐ రికార్డ్ చేస్తూనే ఉంది - అవినాష్ న్యాయవాది
* దస్తగిరి నుండి మూడు 161 స్టేట్మెంట్ లు సిబిఐ రికార్డ్ చేశారు
* నెలన్నర రోజులు దస్తగిరి సిబిఐ కస్టడీలో ఉన్నాడు
* దస్తగిరి కి ఎప్పుడు బెయిల్ వచ్చింది - హై కోర్టు
* దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాకే యాంటిసిపేటర్రి బెయిల్ ఒచ్చింది - అవినాష్
* దస్తగిరి స్టేట్మెంట్ తరువాతే ఏ - 3 అరెస్ట్ జరిగింది
* 7/10/2021 నాడు దస్తగిరి ముందస్తు బెయిల్ దాఖలు చేశాడు
* నేను అమాయకుడిని అని దస్తగిరి మందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు
* దస్తగిరి కి యంటీసిపెటరీ బెయిల్ కు సిబిఐ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు - అవినాష్ న్యాయవాది
* 22/10//2021 దస్తగిరి కి కోర్ట్ బెయిల్ మంజూరు వచ్చింది
* దస్తగిరి కి బెయిల్ వచ్చిన నలుగు రోజులకే సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది
* 26/11/2021 నాడు దస్తగిరి నీ అప్రూవర్ గా అనుమతి ఇచ్చింది
* సీన్ ఆఫ్ క్రైమ్ లో సాక్ష్యాధారాలు చెరిపేస్తున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారు
హైకోర్టు ప్రశ్నలు-సీబీఐ సమాధానాలు:
* ఆ పోలీసులపై సిబిఐ ఏమైనా చర్యలు తీసుకుందా - హైకోర్టు
* ఇంకా దర్యాప్తు చేస్తున్నామని కోర్ట్ కు తెలిపిన సిబిఐ
* వాచ్‌మెన్ రంగన్న స్టేట్మెంట్ ఏం చెప్పాడు - హైకోర్టు
* రంగన్న సిట్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకం - హైకోర్టు
* రంగన్న స్టేట్మెంట్ కాపీ ప్రొడ్యూస్ చేయండి - హైకోర్టు
* నలుగురు నిందితులను చూసింది రంగన్న కాబట్టి అతని స్టేట్మెంట్ ను సిబిఐ రికార్డ్ చేసిందా లేదా? - హైకోర్టు
సునీత తరపు న్యాయవాది రవిచంద్ వాదనలు:
* వివేకా గుండె పోటుతో చనిపోయాడని చెప్పారు
* రక్తపు వాంతులతో మృతి చెందినట్లు చెప్పారు
* హత్య జరిగితే గుండె పోటు ఎలా చెప్పారు
* ఇందులో కుట్ర దాగి ఉంది
* రాజారెడ్డి, గంగి రెడ్డి హాస్పిటల్ నుండి వచ్చి కుట్లు వేశారు
* ఈ ప్రక్రియ జరిగే టప్పుడు అవినాష్ రెడ్డి, కృష్ణ రెడ్డి, గంగి రెడ్డి, శంకర్ రెడ్డి ,మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారు
* అవినాష్ రెడ్డి నోటీసులు ఇచినప్పుడల్లా ఏదో ఒకటి చెబుతున్నారు
* మొదట పార్లమెంటు సమావేశాలు ఉన్నందున విచారణకు రాలేనన్నారు
* రెండో నోటీసుకు హైకోర్టు లో పిటిషన్ వేశారు
* మిగతా నిందితులను అరెస్టు చేసినప్పుడు తననెందుకు చేయలేదని ఇప్పుడు అవినాశ్ ప్రశ్నిస్తున్నారు
* మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు
* ఇప్పుడు తల్లి అనారోగ్యం అంటున్నారు
విశ్వ భారతి హాస్పిటల్ వద్ద పరిస్థితి వివరించిన సునీత తరపు న్యాయవాది
* హాస్పిటల్ లో కి ఎవరిని వెళ్లనివ్వకుండ హాస్పిటల్ ముందు అవినాష్ అనుచరులు టెంట్ వేసుకొని కూర్చున్నారు
* ఆ ఫోటోలను జడ్జ్ కి సమర్పించిన న్యాయవాది రవి చందర్
* అవినాష్ రెడ్డి ప్రభావిత వ్యక్తి అని చెప్పడానికి కర్నూల్ హాస్పిటల్ ఘటన ఒక ఉదాహరణ
* భయ భ్రాంతులకు గురయ్యేలా వ్యవహరించారు
సీబీఐ వాదనలు రేపు వింటామన్న న్యాయస్థానం:
* తదుపరి విచారణ రేపు (మే 27, 2023, శనివారం) ఉదయం 10.30కి వాయిదా
* ముగిసిన సునీత తరపు వాదనలు
* రేపు సీబీఐ వాదనలు వింటామన్న న్యాయస్థానం