Elon Musk: నేను ట్రాన్స్‌జెండర్‌ని.. ఈ విషయం మా నాన్నకు చెప్పొద్దు: ఎలాన్ మస్క్ కూతురు
ABN , First Publish Date - 2023-09-03T18:30:04+05:30 IST
తాను ట్రాన్సెజెండర్‌ని అని, తన పేరును జెన్నాగా మార్చుకున్నానని, ఈ విషయం తన నాన్నకు చెప్పొద్దంటూ ట్విటర్(ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ కూతురు జేవియర్ అలెగ్జాండర్ తన అత్తకు గతంలో చేసిన మిసేజ్ తాజాగా బయటికొచ్చింది.
తాను ట్రాన్సెజెండర్‌ని అని, తన పేరును జెన్నాగా మార్చుకున్నానని, ఈ విషయం తన నాన్నకు చెప్పొద్దంటూ ట్విటర్(ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్ కూతురు జేవియర్ అలెగ్జాండర్ తన అత్తకు గతంలో చేసిన మెసేజ్ తాజాగా బయటికొచ్చింది. వాల్టర్ ఐజాక్సన్ అనే రచయిత ఎలాన్ మస్క్ జీవిత రాశారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఈ పుస్తకంలోని సారాంశాన్ని ప్రచురించారు. ఆ పుస్తకం ద్వారా అనేక ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఎలాన్ మస్క్, జస్టిస్ విల్సన్ దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. వారు జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్. అయితే 2008లో ఎలాన్ మస్క్, జస్టిస్ విల్సన్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత జేవియర్ అలెగ్జాండర్ లింగ మార్పిడి చేసుకుని అమ్మాయిగా మారాడు. 2021లో అంటే అంటే 16 ఏళ్ల వయసులో ఆడపిల్లగా తన జెండర్ మార్చుకున్నాడు. ఈ విషయాన్ని మొదట తన అత్తకు చెప్పాడు. జెండర్ మారడంతో తన పేరును వివియన్ జెన్నా విల్సన్‌గా మార్చుకున్నాడు.
తన తండ్రి మీద ఉన్న కోపంతోనే ఇలా చేసినట్లు గతంలో జెన్నా తెలిపింది. ఆడపిల్లగా మారిన తర్వాత తండ్రితో ఆమె తన బంధాన్ని తెంచుకుంది. మస్క్ ప్రవర్తన ట్రాన్స్‌జెండర్లకు వ్యతిరేకంగా ఉండడమే దీనికి కారణం. అయితే తన కూతురితో విడిపోవడం తనను చాలా బాధించిందని గతంలో ఎలాన్ మస్క్ తెలిపారు. 10 వారాల వయసులో చనిపోయిన తన మొదటి కుమార్తె నెవాడా మరణం కంటే ఇది ఎక్కువగా బాధించినట్లు తెలిపారు. ఇక ఆ తర్వాత తన కూతురు జెన్నాను కలుసుకోవడానికి ప్రయత్నించి మస్క్ విఫలమైనట్లు సమాచారం. దీనికి కారణం ఆమె చదువుకున్న పాఠశాల, కమ్యూనిష్టు భావాలు కల్గి ఉండడమని మస్క్ చెప్పారు. తన కూతురిని బ్రెయిన్ వాష్ చేశారని, ధనవంతులు ఎవరూ మంచి వారు కారనే భావనతో ఆమె ఉందని ఆయన చెప్పారు. కాగా ఎలాన్ మస్క్ ధనవంతుడనే సంగతి తెలిసిందే. ఆయన వ్యక్తిగత సంపద 257.7 బిలియన్ల డాలర్లు ఉంటుందని సమాచారం.