No Hike: ఆ 5 వేల మందికి బ్యాడ్ న్యూస్ చెప్పిన ఫ్లిప్‌కార్ట్!
ABN , First Publish Date - 2023-02-27T20:38:50+05:30 IST
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్(Flipkart) ఇటీవల ఓ ప్రకటన చేస్తూ తమ
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్(Flipkart) ఇటీవల ఓ ప్రకటన చేస్తూ తమ ఉద్యోగుల్లో 30 శాతం మందికి మదింపు ఉండబోదని ప్రకటించింది. అంటే.. సంస్థలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సహా దాదాపు 5 వేల మంది ఉద్యోగులకు ఈ ఏడాది వేతన పెంపు( Increments) లేనట్టేనన్నమాట. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులు, అస్థిర పరిస్థితుల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్(Krishna Raghavan) ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసినట్టు ‘మనీ కంట్రోల్’ తెలిపింది.
ఆ మెయిల్‌లో పేర్కొన్న ప్రకారం.. ఈ ఏడాది 70 శాతం మందికి మాత్రమే వేతన పెంపు ఉంటుంది. అంటే మిగతా 30 శాతం (దాదాపు 5 వేల మంది)కి ఎలాంటి ఇంక్రిమెంట్లు ఉండవు. వీరంతా గ్రేడ్ 10, ఆపైన ఉన్నవారు కావడం గమనార్హం. అయితే, తర్వాతి ప్రణాళికలో మాత్రం గ్రేడ్ 9, అంతకంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తారు.
ఫ్లిప్‌కార్ట్ వార్షిక మూల్యాంకనం పూర్తి చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర టెక్ కంపెనీల్లానే ఫ్లిప్‌కార్ట్ కూడా స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా గందరగోళంలో ఉంది. ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు లాభాలను పెంచుకోవడంలో భాగంగా ఉద్యోగులకు వేతన పెంపు ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ఫ్లిప్‌కార్ట్ ఏప్రిల్ 1 నుంచి వార్షిక ఇంక్రిమెంట్లు ఇవ్వనుంది.