Sensex: కొత్త ఏడాది మొదటి రోజున మార్కెట్ల శుభారంభం
ABN , First Publish Date - 2023-01-02T16:21:13+05:30 IST
నూతన ఏడాది 2023లో (new year) దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) శుభారంభం చేశాయి. ఏడాదిలో మార్కెట్లకు మొదటి రోజయిన సోమవారం సూచీలు లాభాల్లో ముగిశాయి.
ముంబై: నూతన ఏడాది 2023లో (new year) దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) శుభారంభం చేశాయి. ఏడాదిలో మార్కెట్లకు మొదటి రోజయిన సోమవారం సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) 327 పాయింట్లు వృద్ధి చెంది 61,167.79 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్ఈ నిఫ్టీ (Nifty) సూచీ 92 పాయింట్లు లాభపడి 18,197 స్థాయి వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా అత్యధిక మార్కెట్లకు సెలవు దినం కావడంతో దేశీయ మార్కెట్లలో నిర్ణయాత్మక దిశలో కదల్లేదని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్పంగా 0.07 శాతం, 0.12 శాతం చొప్పున వృద్ధి చెందాయి. అనిశ్చితి సూచీ ఇండియా వీఐఎక్స్ 4 శాతం మేర పెరిగింది.
స్టాక్స్ విషయానికి వస్తే.. సెన్సెక్స్ ప్యాక్‌పై అత్యధికంగా టాటా స్టీల్ (Tata steel) 5.86 శాతం వృద్ధి చెందింది. ఆ తర్వాత టాటా మోటార్స్ 1.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.35 శాతం, ఎం అండ్ ఎం 1.09 శాతం, రిలయన్స్ 1.06 శాతం, ఇన్ఫీ 1.03 శాతం చొప్పున లాభపడ్డాయి. నష్టపోయిన స్టాక్స్ జాబితాలో అత్యధికంగా ఏసియన్ పెయింట్స్ 1.47 శాతం దిగజారింది.