Crime: పాఠాలు చెప్పాల్సిన మాష్టరే దారుణానికి ఒడిగట్టాడు.. పాపం ఐదారేళ్ల చిన్నారులు.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-08-23T15:51:26+05:30 IST

పాఠాలు చెప్పాల్సిన మాష్టర్ ఆ చిన్నారుల పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఏబీసీడీలు, పదాలు నేర్పించాల్సిన చేతితో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Crime: పాఠాలు చెప్పాల్సిన మాష్టరే దారుణానికి ఒడిగట్టాడు.. పాపం ఐదారేళ్ల చిన్నారులు.. అసలు ఏం జరిగిందంటే..?

ముంబై: పాఠాలు చెప్పాల్సిన మాష్టర్ ఆ చిన్నారుల పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఏబీసీడీలు, పదాలు నేర్పించాల్సిన చేతితో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇల్లు, పాఠశాల తప్ప మరో లోకం తెలియని పసి పిల్లలపై చేయి వేశాడు. ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోలని ఐదారేళ్ల వయస్సు గల చిన్నారులను లైంగింకంగా వేధించాడు. అలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా నలుగురు బాలికల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని ముంబైలో గల విక్రోలిలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎంసీ పాఠశాలలో 23 ఏళ్ల సౌరభ్ ఉచటే అనే క్రీడా ఉపాధ్యాయుడికి ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల బాధ్యతలు అప్పగించారు. కానీ సదరు ఉపాధ్యాయుడు ఆటలు ఆడించే నెపంతో అభం శుభం తెలియని నలుగురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రెండో తరగది చదువుతున్న విద్యార్థిని విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో ఉపాధ్యాయుడి దారుణాలు బయటపడ్డాయి. బాలిక తల్లిదండ్రులు వెంటనే విక్రోలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సౌరభ్ ఉచటే మొత్తం నలుగురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు ఒక బృందాన్ని పంపి నిందితుడిని అరెస్ట్ చేశారు.


“నిందితుడు బీఎంసీ పాఠశాలలో 2023 జూలైలో క్రీడా ఉపాధ్యాయునిగా నియమితుడయ్యాడు. దీనికి ముందు అతను థానేలోని పాఠశాలలో పని చేశాడు. ఇప్పటి వరకు నలుగురు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌ను బోధించేందుకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు బాధ్యతలు అప్పగించారు’’ అని విఖ్రోలి పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. కాగా నిందితుడు గతంలో థానే పాఠశాలలో పని చేసినప్పుడు కూడా ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలింది. అక్కడ కూడా రెండో తరగతి బాలికపై ఐదు సార్లు లెంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. “నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఇప్పటివరకు నలుగురు బాధిత బాలికల తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదించారు. నిందితుడిని మరింత లోతుగా విచారిస్తున్నాం. బుధవారం కోర్టులో హాజరుపరుస్తాం’’ అని డీసీపీ పురుషోత్తం కరాద్ తెలిపారు.

Updated Date - 2023-08-23T15:56:53+05:30 IST