Crime: మూడేళ్ల కొడుకు కిడ్నాపయ్యాడని పోలీసులను ఆశ్రయించిన తండ్రి.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి పోలీసుల మైండ్ బ్లాంక్!

ABN , First Publish Date - 2023-08-16T19:22:35+05:30 IST

‘‘నా మూడేళ్ల కుమారుడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నా కొడుకును తీసుకుని గురుద్వారకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మాపై దాడి చేశారు. నా దగ్గర ఉన్న ఫోన్, పర్సును లాక్కున్నారు. అలాగే నా కొడుకును కూడా తీసుకుని వెళ్లిపోయారు. దయచేసి నా కొడుకును రక్షించండి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్’’ అంటూ బతిమిలాడుతూ ఆదివారం ఓ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

Crime: మూడేళ్ల కొడుకు కిడ్నాపయ్యాడని పోలీసులను ఆశ్రయించిన తండ్రి.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి పోలీసుల మైండ్ బ్లాంక్!

పంజాబ్‌: ‘‘నా మూడేళ్ల కుమారుడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నా కొడుకును తీసుకుని గురుద్వారకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మాపై దాడి చేశారు. నా దగ్గర ఉన్న ఫోన్, పర్సును లాక్కున్నారు. అలాగే నా కొడుకును కూడా తీసుకుని వెళ్లిపోయారు. దయచేసి నా కొడుకును రక్షించండి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్’’ అంటూ బతిమిలాడుతూ ఆదివారం ఓ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఆ తండ్రి బాధను అర్థం చేసుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. బాలుడిని రక్షించడానికి శతవిధాల ప్రయత్నాలు చేశారు. బాలుడి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వివరాలు తెలిసిన వాళ్లు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయమని నంబర్లు కూడా ఇచ్చారు. 3 రోజులపాటు బాలుడి కోసం విస్తృతంగా గాలించారు. కానీ చివరకు అసలు విషయం తెలిసి పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. అసలు నేరస్థుడు ఆ తండ్రేనని తెలుసుకుని నోరేళ్లబెట్టారు. నేరస్థుడిని పక్కనే పెట్టుకుని ఊరంతా వెతికిన తమ తీరుకు వారిలో వారే నవ్వుకున్నారు. కానీ చివరకు తమను ఇంత మాయ చేసిన ఆ తండ్రిపై పోలీసులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.


అసలు ఏం జరిగిందంటే.. పంజాబ్‌లోని తార్న్ తరణ్ జిల్లాలో ఉన్న అంగ్రేజ్ సింగ్ అనే వ్యక్తి ఆదివారం పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. తను తన మూడేళ్ల కుమారుడితో ఓ గురుద్వారకు పూజ చేయడానికి వెళ్తుంటే గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని చెప్పాడు. తన వద్ద ఉన్న సెల్ ఫోన్, డబ్బులు లాక్కొని తన కుమారుడిని కూడా వారి వెంట తీసుకుపోయారని చెప్పాడు. దీంతో తన కొడుకును రక్షించమని పోలీసులను వేడుకున్నాడు. అంగ్రేజ్ సింగ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తప్పిపోయిన బాలుడి కోసం విస్తృతంగా గాలించారు. బాలుడి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అచూకీ తెలిసిన వారు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని నంబర్లు కూడా ఇచ్చారు. అచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని చెప్పారు. అలా మూడు రోజులు వెతికినప్పటికీ పోలీసులకు ఎలాంటి అచూకీ లభించలేదు. అయితే అంగ్రేజ్ సింగ్ వ్యవహారశైలిపై పోలీసులకు కాస్త అనుమానం కల్గింది. దీంతో అంగ్రేజ్ సింగ్‌ను తమదైన రీతిలో విచారించారు.

దీంతో తన మూడేళ్ల కుమారుడిని తనే గొంతుకోసి చంపినట్లు అంగ్రేజ్ సింగ్ ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని ఆదివారం రాత్రి చోహ్లా సాహిబ్ సమీపంలోని కాలువలో పడేసినట్లు చెప్పాడు. అంగ్రేజ్ సింగ్ చెప్పిన సమాధానంతో పోలీసులు షాకయ్యారు. కాలువలో బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం అమృత్‌సర్‌కు పంపిన పోలీసులు.. పోయిందని చెప్పిన సెల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా అంగ్రేజ్ సింగ్ అంతకుముందు రోజు భార్యతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ మనస్తాపంతోనే కుమారుడిని చంపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే కుమారుడి హత్యకు గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అంగ్రేజ్ సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. తదుపరి విచారణ కొనసాగుతుంది.

Updated Date - 2023-08-16T19:37:28+05:30 IST