Crime: నరుడు కాదు.. నరరూప రాక్షసుడు.. 32 ఏళ్ల ప్రేయసిని చంపి.. ముక్కలుగా చేసి.. కుక్కర్‌లో శరీర భాగాలను ఉడకబెట్టి మరీ..!

ABN , First Publish Date - 2023-06-08T12:32:37+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో ప్రియురాలు శ్రద్ధావాకర్‌ను దారుణంగా హతమార్చి ముక్కలుగా చేసిన ఆప్తాబ్ పూనావాలా కేసు మరవక ముందే దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిధిలోని థానేలో మరో దారుణ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

Crime: నరుడు కాదు.. నరరూప రాక్షసుడు.. 32 ఏళ్ల ప్రేయసిని చంపి.. ముక్కలుగా చేసి.. కుక్కర్‌లో శరీర భాగాలను ఉడకబెట్టి మరీ..!

Mira road live in partner murder: దేశ రాజధాని ఢిల్లీలో ప్రియురాలు శ్రద్ధావాకర్‌ను దారుణంగా హతమార్చి ముక్కలుగా చేసిన ఆప్తాబ్ పూనావాలా కేసు మరవక ముందే దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిధిలోని థానేలో మరో దారుణ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. థానే పరిధిలోని మీరా రోడ్‌లో (Mira road) ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే 56 ఏళ్ల వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతో సహజీవనం చేస్తున్న మహిళను చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. అనంతరం ఆ శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడు. ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో పొరుగింటివారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ దారుణం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు మనోజ్ సహాని (56) గత మూడేళ్లుగా సరస్వతి వైద్య (36) అనే మహిళతో లివ్-ఈన్ రిలేషన్‌షిప్ (Live in Relationship) లో ఉన్నాడు.

m.jpg

బోరివాలీలో అతడు చిన్న కిరాణ దుకాణం నడుపుతున్నాడు. అయితే, కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అది కాస్తా పెద్దదై.. సరస్వతి వైద్యను మనోజ్ హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని చెట్టు కట్టర్‌తో నరికి (Cutter Machine), ఆమె శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడని (Mixer Pressure Cooker) పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ప్లాట్ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మనోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి ఇంట్లో నుంచి కుళ్లిపోయిన మహిళ మృతదేహం ముక్కలను (Chops Body into Pieces) స్వాధీనం చేసుకున్నారు. కాగా, కుళ్లిపోయిన శరీర భాగాలను బట్టి హత్య మూడు-నాలుగు రోజుల క్రితమే జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Auto Driver: పొరపాటున ఆటో డ్రైవర్ అయ్యాడు కానీ.. కాస్త చదువుకుని ఉంటే ఎక్కడో ఉండేవాడు.. ఈ ఆటోను ఎలా మార్చేశాడో చూస్తే..!

Updated Date - 2023-06-08T13:02:14+05:30 IST