Cyber crimes: సైబర్ నేరాల్లో హైదరాబాద్ టాప్
ABN , First Publish Date - 2023-12-05T12:26:42+05:30 IST
మెట్రో నగరాల్లో సైబర్ నేరాలు(Cyber crimes) విపరీతంగా పెరిగాయని.. 2022లో అంతకు ముందు
- ఇతర నేరాల్లో ఇతర నగరాలతో పోలిస్తే కాస్త మెరుగు
- 2022 నివేదిక వెల్లడించిన జాతీయ నేర గణాంకాల సంస్థ
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): మెట్రో నగరాల్లో సైబర్ నేరాలు(Cyber crimes) విపరీతంగా పెరిగాయని.. 2022లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 24శాతం సైబర్ క్రైం పెరిగిందని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. 2020-22 రెండేళ్లకు గాను... సోమవారం వెల్లడించిన గణాంకాల్లో ఐపీసీ (ఇండియన్ పెనల్ కోడ్) నేరాలు ఇతర నేరాలతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ... సైబర్ నేరాల్లో మాత్రం హైదరాబాద్ ప్రథమస్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ పలు నేరాల్లోనూ ప్రథమ స్థానంలో ఉంది. హత్యలు, దోపిడీల్లాంటి నేరాల్లో హైదరాబాద్ సిటీ కాస్త మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 19 మెట్రో నగరాల నివేదిక ఆధారంగా ఎన్‌సీఆర్‌బీ వెల్లడించిన గణాంకాల్లో... హైదరాబాద్ గణాంకాలిలా ఉన్నాయి.